Over Sleeping : రోజూ ఉద‌యం ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారా..? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Over Sleeping : ప్ర‌స్తుత కాలంలో చాలా మందికి రాత్రి పూట ఆల‌స్యంగా నిద్రించ‌డం ఒక అల‌వాటుగా మారింది. సెల్ ఫోన్స్ చూస్తూ, టీ వీ చూస్తూ ఎక్కువ స‌మ‌యం గ‌డిపేస్తున్నారు. దీంతో చాలా ఆల‌స్యంగా నిద్రిస్తున్నారు. ఆల‌స్యంగా నిద్రించ‌డం వ‌ల్ల ఉద‌యం కూడా ఆల‌స్యంగా మేల్కొంటున్నారు. ఇలా ఆల‌స్యంగా నిద్ర‌లేవ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనారోగ్యాల బారిన ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆల‌స్యంగా నిద్ర‌లేవ‌డం వ‌ల్ల గుండె సంబంధ‌మైన జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం 40 శాతం ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే మెట‌బాలిక్ డిసార్డర్స్ అన‌గా జీవ‌న విధానం స‌రిగ్గా లేనందున్న వ‌చ్చే ఊబ‌కాయం, షుగ‌ర్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివ‌ర్, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటిఅనేక ర‌కాల జ‌బ్బుల బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు ప్ర‌యోగాల ద్వారా తెలియ‌జేస్తున్నారు.

ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డి వ‌య‌సు పైబ‌డ‌కుండానే త్వ‌ర‌గా మ‌ర‌ణిస్తున్నార‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆల‌స్యంగా నిద్ర‌లేవ‌డం వ‌ల్ల మాన‌సిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు 30 శాతం ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఆల‌స్యంగా నిద్ర‌లేవడం వల్ల మాన‌సిక ఆందోళ‌న, ఒత్తిడి, డిప్రెష‌న్, చిరాకు, కోపం వంటి అనేక ర‌కాల మాన‌సిక ప‌ర‌మైన స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతున్నాయ‌ని వారు చెబుతున్నారు. అదే విధంగా ఆల‌స్యంగా నిద్ర‌లేవ‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ గ‌డియారం దెబ్బ‌తిని హార్మోన్ల అస‌మ‌తుల్య‌త, థైరాయిడ్ వంటి స‌మ‌స్య‌ల‌తో పాటు శ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌ను అదుపు చేసే హార్మోన్ల ప‌నితీరు దెబ్బ‌తింటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Over Sleeping or waking up late everyday can be harmful to health
Over Sleeping

అదే విధంగా ఆల‌స్యంగా నిద్ర‌లేవ‌డం వ‌ల్ల మెద‌డులో క‌ణాలు కుచించుకుపోయి మ‌తిమ‌రుపు, ఆల్జీమ‌ర్స్ వంటి స‌మ‌స్యలు కూడా వ‌స్తాయ‌ని వారు చెబుతున్నారు. ఆల‌స్యంగా నిద్రలేవ‌డం అనే అల‌వాటు నుండి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాల‌ని లేదంటే అనేక ర‌కాల స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట త్వ‌ర‌గా నిద్రించి ఉద‌యాన్నే త్వ‌ర‌గా నిద్ర‌లేవ‌డం వ‌ల్ల రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చ‌ని అలాగే దీర్ఘ‌కాలం పాటు ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేకుండా ఆరోగ్యంగా జీవించ‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts