Peanuts And Chickpeas : వీటిని తింటే చాలు.. ర‌క్తం బాగా ప‌డుతుంది.. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది..!

Peanuts And Chickpeas : ఒక చ‌క్క‌టి చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల బ‌ల‌హీన‌త‌, నీర‌సం, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య కూడా దూర‌మ‌వుతుంది. అలాగే జుట్టు రాల‌డంతో పాటు చ‌ర్మంపై ముడ‌త‌లు వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో మార్పు రావ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని, అందాన్ని ఇచ్చే ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలి.. ఎలా వాడాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ న‌ల్ల శ‌న‌గ‌ల‌ను వాడాల్సి ఉంటుంది.

వీటిలో ప్రోటీన్స్, క్యాల్షియం, ఐర‌న్, ఫైబ‌ర్, విట‌మిన్స్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. గుండె మరియు మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇవి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. శ‌రీరంలో బ‌ల‌హీన‌త‌ను, నీర‌సాన్ని త‌గ్గించి శ‌రీరాన్ని ధృడంగా, ఆరోగ్యంగా చేయ‌డంలో శ‌న‌గ‌లు ఎంతో తోడ్ప‌డ‌తాయి. వీటితో పాటు మ‌నం ప‌ల్లీల‌ను కూడా తీసుకోవాలి. ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో, ఎముకల‌ను ధృడంగా చేయ‌డంలో, జ్ఞాప‌క‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, చ‌ర్మాన్ని అందంగా కాంతివంతంగా మార్చ‌డంలో పల్లీలు చ‌క్క‌గా ప‌ని చేస్తాయి.

Peanuts And Chickpeas take them daily for these benefits
Peanuts And Chickpeas

అలాగే మ‌నం ఉప‌యోగించాల్సిన చివ‌రి ప‌దార్థం ఎండు ద్రాక్ష‌. మ‌న శ‌రీరంలో మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని అందించ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో గుప్పెడు శ‌న‌గ‌ల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో అవి మునిగే వ‌ర‌కు నీటిని పోయాలి. త‌రువాత ఇందులో 2 టీ స్పూన్ల ప‌ల్లీల‌ను వేసుకోవాలి. ఇక చివ‌ర‌గా దీనిలో 25 ఎండు ద్రాక్ష‌ను వేయాలి. వీట‌న్నింటిని రాత్రంతా చ‌క్క‌గా నాన‌బెట్టుకోవాలి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క్యాల్షియం లోపం రాకుండా ఉంటుంది. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. నీర‌సం, బ‌ల‌హీన‌త త‌గ్గుతుంది.

అలాగే ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో మ‌లినాలు తొల‌గిపోతాయి. ఇలా నాన‌బెట్టిన ప‌దార్థాల‌ను రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని ఉద‌యం ప‌ర‌గ‌డుపున తినాలి. వీటిని తిన్న త‌రువాత గోరు వెచ్చ‌ని పాల‌ను తాగాలి. త‌రువాత భాగాన్ని సాయంత్రం తినాలి. ఇలా ప‌దార్థాలు తిని అలాగే ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో పోష‌కాహార లోపం త‌లెత్త‌కుండా ఉంటుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ అందుతాయి. అలాగే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. నొప్పుల‌న్నీ మ‌టుమాయ‌మ‌వుతాయి. చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను ఈ విధంగా వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts