Potato And Rice : ప్రస్తుత తరుణంలో డయాబెటిస్ బారిన పడి అనేక మంది బాధపడుతున్నారు. షుగర్ వ్యాధి వచ్చిందంటే ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ముఖ్యంగా పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలను తినడం మానేస్తారు. పిండి పదార్థాలు అధికంగా ఉండే వాటిల్లో బంగాళా దుంపలు, అన్నం వంటివి ఉన్నాయి. వీటిని షుగర్ వచ్చిన వారు తినరు. తింటే షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. కనుక ఈ ఆహారాలను మాత్రం తీసుకోరు. అయితే న్యూట్రిషనిస్టులు చెబుతున్న ప్రకారం షుగర్ ఉన్నవారు కూడా వీటిని నిర్భయంగా తినవచ్చు. కానీ షుగర్ పెరగకుండా చూసుకోవచ్చు. అయితే ఇది ఎలా సాధ్యం.. అని ఆశ్చర్యపోతున్నారా.. ఇందుకు న్యూట్రిషనిస్టులు ఏమని చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలుగడ్డలు, అన్నంలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిని గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ చాలా ఎక్కువ. కనుక వీటిని తిన్న వెంటనే షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. కనుక వీటిని తినకూడదని చెబుతుంటారు. అయితే ఆలుగడ్డలు, అన్నంను వండిన తరువాత వెంటనే తినరాదు. వాటిని 8 నుంచి 12 గంటల వరకు ఫ్రిజ్‌లో ఉంచాలి. దీంతో అవి చల్లగా మారుతాయి. ఈ క్రమంలో వాటిలో పలు రసాయనిక చర్యలు జరుగుతాయి. ఇలా జరగడం వల్ల ఆయా ఆహారాల్లో ఉండే సాధారణ పిండి పదార్థాలు.. రెసిస్టెంట్ స్టార్చ్ లా మారుతాయి. ఇవి మన జీర్ణాశయంలో అంత సులభంగా జీర్ణం కావు. నేరుగా పెద్దపేగు వద్దకు చేరుతాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ పెరగవు. కనుక ఈ ఆహారాలను వండి వెంటనే తినకుండా ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాతే తినాలి. దీంతో షుగర్ లెవల్స్‌ను పెరగకుండా చూసుకోవచ్చు.
ఇలా వీటిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వీటిల్లో ఏర్పడే రెసిస్టెంట్ స్టార్చ్ మన జీర్ణాశయంలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు చేస్తుంది. దీంతో వాపులు తగ్గుతాయి. అలాగే ఇన్సులిన్ నిరోధకత కూడా తగ్గుతుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కనుక ఆలుగడ్డలు, అన్నంలను ఈ విధంగా తింటే షుగర్ లెవల్స్ పెరగవు సరికదా.. వీటిని తగ్గించుకోవచ్చన్నమాట.
ఇక రెసిస్టెంట్ స్టార్చ్ సహజ సిద్ధంగా ఉండే పదార్థాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. పప్పు దినుసులు, కూరగాయలు వంటి వాటిల్లో ఈ స్టార్చ్ సహజంగానే ఉంటుంది. కనుక వీటిని తింటున్నా కూడా షుగర్ లెవల్స్ పెరగవు. తగ్గుతాయి. రెసిస్టెంట్ స్టార్చ్ సహజంగా లేకపోతే ఆ పదార్థాలను వండిన తరువాత చల్లార్చాలి. ఫ్రిజ్‌లో పెట్టి తినాలి. దీంతో రెసిస్టెంట్ స్టార్చ్ ఏర్పడుతుంది. ఇది అంత త్వరగా జీర్ణం కాదు కనుక షుగర్ లెవల్స్ ప్రభావితం కావు. ఇలా మధుమేహ వ్యాధిగ్రస్తులు తమకు ఇష్టమున్న ఆహారాలను సైతం ఎంచక్కా తినవచ్చు. షుగర్ లెవల్స్ పెరుగుతాయని భయపడాల్సిన పనిలేదు.