Raisins Soaked In Curd : మనం ఆహారంగా నల్లగా ఉండే ఎండు ద్రాక్షలను కూడా తీసుకుంటూ ఉంటాము. నల్ల ఎండు ద్రాక్షలు కూడా ఎన్నో పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఇవి మనకు డ్రై ఫ్రూట్ షాపులల్లో, సూప్ మార్కెట్ లో, ఆన్ లైన్ లో విరివిగా లభిస్తాయి. చాలా మంది వీటిని నేరుగా తింటూ ఉంటారు. అలాగే తీపి పదార్థాల తయారీలో వాడుతూ ఉంటారు. కొందరు నీటిలో నానబెట్టి తీసుకుంటూ ఉంటారు. ఎలా తీసుకున్నా కూడా ఎండు ద్రాక్షలు మనకు మేలు చేస్తాయి. అయితే వీటిని పెరుగులో నానబెట్టి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను, పోషకాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పెరుగులో నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్షలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి… అలాగే వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలి…. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ 5 లేదా 6 నల్ల ఎండు ద్రాక్షలను ఒక కప్పు పెరుగులో ఒక గంట పాటు నానబెట్టి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అలాగే వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఎండు ద్రాక్షను పెరుగులో నానబెట్టి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల తగినంత క్యాల్షియం లభించి ఎముకలు ధృడంగా తయారవుతాయి.
ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా దంతాలు కూడా ధృడంగా తయారవుతాయి. అలాగే ఎండుద్రాక్షను పెరుగులో నానబెట్టి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో ధృడంగా తయారవుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు కావల్సిన చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎండు ద్రాక్షను పెరుగులో నానబెట్టి తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. సులభంగా బరువు కూడా తగ్గవచ్చు. ఈ విధంగా నల్ల ఎండు ద్రాక్షలను పెరుగులో నానబెట్టి తీసుకోవడం వల్ల మనం ఎన్నో పోషకాలను, రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.