Rose Flowers Tea : గులాబీ పూలు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. చాలామంది అందుకే గులాబీ మొక్కలను ఇంట్లో పెంచుతూ ఉంటారు. గులాబీ పువ్వులు కేవలం అలంకరణకే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా పనిచేస్తాయి. గులాబీ పూలతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందచ్చనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. గులాబీ రేకులు మంచి సువాసనని కలిగి ఉంటాయి. గులాబీ రేకులతో టీ చేసుకుని తీసుకుంటే ఎన్నో లాభాలని పొందవచ్చు. చాలా సమస్యలకి దూరంగా ఉండొచ్చు.
తాజా గులాబీ రేకుల్ని పొడి కింద చేసుకుని టీ చేసుకోవడం వలన చక్కటి ప్రయోజనాలను పొందొచ్చు. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోండి. అందులో ఒక గ్లాసు వరకు నీళ్లు పోసి, దానిలో రెండు స్పూన్ల గులాబీ రేకులు కానీ గులాబీ రేకుల యొక్క పొడిని కానీ వేసి మరిగించుకోండి. ఐదు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా మరిగిన తర్వాత అందులో ఒక స్పూన్ తేనెతోపాటు కొంచెం నిమ్మరసం వేసుకోండి.
వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి, ప్రతిరోజు ఉదయాన్నే తాగితే శరీరంలో వ్యర్థ పదార్థాలు బయటికి వచ్చేస్తాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఇందులో ఉంటాయి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండవచ్చు. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ టీ ని తీసుకుంటే ఆ సమస్య నుండి బయటపడొచ్చు.
ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గిపోతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు రాత్రిళ్ళు నిద్రపోవడానికి అరగంట ముందు ఈ టీ ని తీసుకుంటే మంచి నిద్రని పొందొచ్చు. వీటిని తాగడం వలన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా అందుతాయి. నరాలని ప్రశాంత పరిచి ఆందోళనని కూడా ఈ టీ తగ్గిస్తుంది. దగ్గు, జలుబు నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.