Snooze Button Impact : మనలో చాలా మందికి ఉదయం పూట అలారం పెట్టుకుని నిద్రలేచే అలవాటు ఉంటుంది. సమయానికి నిద్రలేవడానికి అలారం సహాయపడినప్పటికి ఇది మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. అలారం మోగగానే ముందుగా మనం చూసేది స్నూజ్ బటన్. చాలా మంది ఈ స్నూజ్ బటన్ ను నొక్కేసి మరికొంత సమయం పడుకుందాలే అని భావిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి చర్యలు ప్రమాదాలకు దారి తీస్తాయని, అలారంలో ఉండే స్నూజ్ బటన్ మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. స్నూజ్ బటన్ ను నొక్కి మరలా నిద్రపోవడం వల్ల మన శరీరం స్లీప్ అప్నియా అనే స్థితిలోకి వెళ్తుంది. దీనికారణంగా మనం మరలా స్నూజ్ బటన్ ను నొక్కి నిద్రపోయినప్పటికి ఎటువంటి ఫలితం ఉండదు.
దీంతో మనం ఆశించిన రిఫ్రెష్ లభించదు. మనం ఇంకా అలిసిపోయినట్లు అనిపిస్తుంది. అలాగే స్నూజ్ బటన్ ను నొక్కి మరలా నిద్రించడం వల్ల మన నిద్ర చక్కాలకు భంగం కలుగుతుంది. మన గాఢ నిద్రలో కూడా అనేక మార్పులు వస్తాయి. అలాగే స్నూజ్ బటన్ ను నొక్కి మరలా నిద్రించడం వల్ల మన శరీర లయలో కూడా మార్పులు వస్తాయి. అలారాన్ని పొడగించడానికి స్నూజ్ బటన్ తయారు చేసినప్పటికి ఇది మనల్ని అతిగా నిద్రపోయేలా ప్రోత్సహిస్తుంది. స్నూజ్ బటన్ ను నొక్కినప్పటికి మనం కొన్నిసార్లు గాఢ నిద్రలోకి వెళ్లిపోతాము. గాఢ నిద్రలోకి పోవడం మంచిదే అయినప్పటికి స్నూజ్ బటన్ ను నొక్కి మరలా నిద్రపోవడం వల్ల చురుకుదనం, అభిజ్ఞా సామర్థ్యం తగ్గుతుంది.
శరీరానికి అలసటగా అనిపిస్తుంది. ఏకాగ్రత దెబ్బతింటుంది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతాము. కనుక మనం ఖచ్చితమైన సమయానికి మేల్కొనేలా అలారాన్ని సెట్ చేసుకోవాలి. సహజ కాంతిని ప్రతిబింబించే స్మార్ట్ అలారం గడియారాలను ఉపయోగించాలి. మనల్ని నిద్ర మేల్కొలిపే అలారం హాయిని ఇవ్వాలి. చికాకును కలిగించకూడదు.