Curd Bun Dosa : కర్డ్ బన్ దోశ.. వీటినే పుల్లట్టు అని అంటారు. పుల్లట్టు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. మనకు ఎక్కువగా రోడ్ల పక్కన బండ్ల మీద కూడా లభిస్తూ ఉంటాయి. ఈ పుల్లట్లని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాల తేలిక. తరుచూ చేసే అల్పాహారాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పుల్లట్లను కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే పుల్లట్లను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కర్డ్ బన్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, మెంతులు – అర టీ స్పూన్, అటుకులు – అర కప్పు, మజ్జిగ – ఒక కప్పు, ఉప్పు – తగినంత.
కర్డ్ బన్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకోవాలి. తరువాత ఇందులో అటుకులు, మెంతులు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత మజ్జిగ పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ బియ్యాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత మూత పెట్టి 8 గంటల పాటు పిండిని పులియబెట్టాలి. పిండి చక్కగా పులిసిన తరువాత ఇందులో ఉప్పు వేసి కలపాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. తరువాత దీనిపై నూనె వేసి తుడుచుకోవాలి. తరువాత గంటెతో పిండిని తీసుకుని అట్టు లాగా వేసుకోవాలి. అట్టు తడి ఆరిన తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. దీనిని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కర్డ్ బన్ దోశ తయారవుతుంది. దీనిని పల్లి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన కర్డ్ బన్ దోశలను అందరూ ఎందరూ ఎంతో ఇష్టంగా తింటారు.