Sonti Water : శరీరంలో వాతం ఎక్కువవడం వల్ల శరీరంలో నొప్పులు అధికమవుతాయి. వాతం ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో మలినాలు, విష పదార్థాలు పేరుకుపోయి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి ఇలా రకరకాల నొప్పులు మొదలవుతాయి. అలాగే కూర్చునేటప్పుడు, నిల్చునేటప్పుడు మోకాళ్ల నుండి శబ్దాలు రావడం జరుగుతుంది. అలాగే కీళ్ల మధ్య జిగురు తగ్గిపోయి కీళ్లు రాపిడికి గురి అవుతాయి. దీంతో నొప్పి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి నొప్పులతో బాధపడే వారు ఒక చక్కటి చిట్కాను ఉపయోగించడం వల్ల చాలా సులభంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ చిట్కాను వాడడం వల్ల వాత దోషాలు, కఫ దోషాలు తొలగిపోతాయి. ఈ చిట్కాను వాడడం వల్ల గౌట్, ఆర్థరైటిస్ సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ చిట్కాను మనం సహజ సిద్దంగా లభించే పదార్థాలతో తయారు చేస్తున్నాము కనుక దీనిని వాడడం వల్ల ఎటవంటి దుష్ప్రభావాలు ఉండవు.
అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవు. మన శరీరంలో ఉండే వాత దోషాలను, నొప్పులను తగ్గించే చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం 50 గ్రాముల శొంఠిని తీసుకోవాలి. అలాగే 50 గ్రాముల మెంతులను, 50 గ్రాముల వామును ఉపయోగించాల్సి ఉంటుంది. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి కలపాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ బెల్లం పొడిని వేసి కలపాలి. అయితే డయాబెటిస్ తో బాధపడే వారు బెల్లం పొడిని ఉపయోగించకపోవడమే మంచిది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని అల్పాహారం తినడానికి అర గంట ముందు తాగాలి.
ఇలా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే వాత దోషం తగ్గిపోతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. నడిచేటప్పుడు మోకాళ్ల నుండి శబ్దం రాకుండా ఉంటుంది. కీళ్ల వాపులు కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ చిట్కాను వాడడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను పాటిస్తూనే క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. రోజూ విటమిన్ డి కోసం ఎండలో కూర్చోవాలి. అలాగే తేలిక పాటి వ్యాయామాలు చేయాలి. ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల కీళ్ల నొప్పులను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.