హెల్త్ టిప్స్

మహిళలూ, సుర్యరశ్మి తగిలితే ఎంతో మంచిది!

ప్రతి రోజూ మూడు గంటల పాటు సూర్యరశ్మి శరీరానికి తగిలితే మహిళలకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గుతాయంటారు టోరంటో యూనినవర్శిటీ రీసెర్చర్లు. సూర్య రశ్మిలో విటమిన్ డి వుంటుందని, విటమిన్ డి కేన్సర్ రాకుండా కాపాడగలదని చెపుతున్నారు. ఏప్రిల్ నుండి అక్టోబర్ నెల వరకు సుమారు ఏడు నెలల పాటు రోజుకి మూడు గంటల చొప్పున వారానికి ఇరవై ఒక్క గంట ఉదయపు నీరెండలో కూర్చుంటే చాలు ఎటువంటి కేన్సర్ ట్యూమర్ రాకుండా మంచి ఫలితాలనిస్తుందంటారు.

మనం తీసుకునే ఆహారంలో విటమిన్ డి వున్నప్పటికి శరీర చర్మం సుమారు 90 శాతం వరకు దానికవసరమైన విటమిన్ డి ని సూర్యరశ్మి ద్వారా గ్రహిస్తుందని చెపుతున్నారు. రీసెర్చర్లు 3101 బ్రెస్ట్ కేన్సర్ రోగులను 3,471 మంది ఆరోగ్యవంతులైన మహిళలతో పరిశీలించారు. టీన్స్ లో 29 శాతం, 20 ల నుండి 30 ల వయసు వరకు 36శాతం, అరవైలు వచ్చేసరికి 50 శాతం రొమ్ము కేన్సర్ రిస్కు తగ్గుతూ వచ్చిందని తెలిపారు.

sun rays are very healthy to women

సూర్యుడు అనాది కాలంగా భారతీయుల ఆరోగ్య ప్రదాత గా పిలువబడుతున్నాడు. మహిళలకే కాదు, పురుషులు, అన్ని వయసుల వారికి సూర్యరశ్మి వలన కలిగే మేలు అంతా ఇంతా కాదు, ఎంతో గొప్పదని చెప్పవచ్చు. భారతీయ సాంప్రదాయంలో నేటికి ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కరించనిదే భారతీయులు తమ దైనందిన చర్యలను ప్రారంభించరనేది ఒక వాస్తవం.

Admin

Recent Posts