Anjeer : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ ఒకటి. ఇది మనకు అన్ని కాలాల్లో ఎక్కడపడితే అక్కడ లభిస్తుంది. అంజీర్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని నేరుగా తినడంతో పాటు వివిధ రకాల తీపి వంటకాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అంజీర్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అంజీర్ లో ఉండే పోషకాలు ఏమిటి..దీనిని తినడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి… అలాగే వీటిని ఎలా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంజీర్ లో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, జింక్, కాపర్, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి. అంజీర్ ను తినడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు ఒత్తుగా, ధృడంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.
అంజీర్ ను తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్య తగ్గుతుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారు రోజూ రెండు నుండి మూడు అంజీర్లను నానబెట్టుకుని రోజూ ఉదయం పరగడుపున తినడం మంచిది. ఇలా అంజీర్ ను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య చాలా సులభంగా తగ్గుతుంది. అంజీర్ లో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అంజీర్ ను తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించడంలో దోహదపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారు రోజూ రెండు నానబెట్టిన అంజీర్ లను, ఒక గ్లాస్ పాలను తాగాలి. ఇలా చేయడం వల్ల రక్తహీనత సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అంజీర్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది.
దీనిని ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే మినరల్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అలాగే రక్తంలో మలినాలను తొలగించడంలో, చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో ఎంతో సహాయపడతాయి. అంజీర్ ను తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అదే విధంగా నీరసం, నిస్సత్తువ, బలహీనత వంటి సమస్యలతో బాధపడే వారు ప్రతిరోజూ అంజీర్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంజీర్ ను తినడం వల్ల మూత్రపిండాల సమస్యలు తగ్గుతాయి. అలాగే హార్మోన్ల అసమతుల్య వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ అంజీర్ లను మనం నానబెట్టి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజూ రాత్రి పడుకునే ముందు రెండు లేదా మూడు అంజీర్ లను నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పరగడుపున తినాలి. ఇలా తీసుకోవడం వల్ల అంజీర్ లో ఉండే పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి. దీంతో మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.