Asafoetida And Ghee : నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. రెగ్యులర్ గా నెయ్యిని వాడడం, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలకి కూడా నెయ్యి పెట్టొచ్చు. అలానే, ఇంగువ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఇంగువ ని రోజు వంటల్లో వాడడం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. ఇవన్నీ సాధారణంగా అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఇంగువ, నెయ్యి కలిపి తీసుకుంటే అద్భుతమైన లాభాలను పొందడానికి అవుతుంది. ఇంగువ, నెయ్యి లో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. రెండిటిని కలిపి తీసుకుంటే, రెట్టింపు ప్రయోజనాలని పొందడానికి అవుతుంది.
నెయ్యి లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ కె తో పాటుగా ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా నెయ్యిలో ఎక్కువగా ఉంటాయి. ఇంగువలో ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియంతో పాటుగా ఫాస్ఫరస్, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రెండిటిని కలిపి తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఇంగువ ని కలిపి తీసుకోవడం వలన అజీర్తి, గ్యాస్ వంటి వాటి నుండి ఉపశమనం లభిస్తుంది.
ఇంగువ, నెయ్యి తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఎముకలు గుల్లగా మారకుండా దృఢంగా ఉండడానికి ఇది సహాయం చేస్తుంది. అలానే, వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలు కూడా ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వలన తొలగిపోతాయి. ఇంగువ, నెయ్యి తీసుకోవడం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఉంటాయి.
యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు రెండిట్లో ఎక్కువగా ఉంటాయి. రెండు కలిపి తీసుకుంటే, మెదడు లోని రక్తనాళాలు శాంత పరిచి, తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. పిల్లల్లో వచ్చే నులిపురుగు సమస్యను కూడా తొలగించడానికి ఇవి ఉపయోగ పడతాయి. ఇంగువ, నెయ్యి మిశ్రమంలో తేనెను కూడా యాడ్ చేసుకున్నట్లయితే గొంతు నొప్పి నుండి రిలీఫ్ కలుగుతుంది.