హెల్త్ టిప్స్

శ‌న‌గ‌ల‌ను రోజూ తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

సాధారణంగా శ‌నగలతో మనం ఎన్నో రకాల వంటలు చేసుకుంటూనే ఉంటాం. అలానే ఏదైనా స్నాక్స్ చేసుకోవడానికి కూడా వీటిని బాగా ఉపయోగిస్తాం. పైగా ప్రత్యేక పూజలు ఉన్నప్పుడు ప్రసాదంలా చేస్తాము. అయితే వీటిని ఉడికించి తిన్నా లేదా మరి ఏ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిది. ఆరోగ్యానికి చక్కటి ప్రయోజనాలు దీని ద్వారా మనకి లభిస్తాయి. శ‌నగలలో మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తిని ఇస్తాయి.

అలానే శెనగలలో పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని మీరు పెంపొందించుకో వచ్చు. మధుమేహం ఉన్నవాళ్లు వీటిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. గ్లూకోజ్, చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి స్త్రీలకు చాలా అవసరం. దీనిలో ఐరన్ ఉంటుంది. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఐరన్ లభిస్తుంది. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.

take chickpeas daily for these wonderful health benefits

శనగల్లో పీచు ఎక్కువగా ఉంటుంది కనుక ఏ వయసు వారు తీసుకున్న ఇట్టే అరిగిపోతుంది. జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా దీనితో మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడం కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. ఇది నిజంగా ఒక ఎనర్జీ బూస్టర్ లాగ కూడా పని చేస్తుంది. చూసారు కదా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..! మరి మీ డైట్ లో చేర్చుకోండి. ఆరోగ్యాంగా ఉండండి.

Admin

Recent Posts