Pistachio : నేటి తరుణంలోచాలా మంది ఆరోగ్యం మీద శ్రద్ద తీసుకోవడం మొదలు పెట్టారు. దీంతో పోషకాలు కలిగిన ఆహారంతో పాటు డ్రై ఫ్రూట్స్ ను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పు కూడా ఒకటి. పిస్తా పప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పిస్తా పప్పు రుచిగా ఉండడంతో పాటు దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. పిస్తా పప్పులో విటమిన్ ఎ, బి, ఈ లతో పాటు క్యాల్షియం, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిండెట్లు పుష్కలంగా ఉన్నాయి. పిస్తా పప్పును తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మెదడు చురుకుగా పని చేస్తుంది.
అలాగే వీటిలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంలో దోహదపడుతుంది. పిస్తాపప్పు తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. వయసు పైబడడం వల్ల వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. పురుషులు పిస్తా పప్పును తీసుకోవడం వల్ల వారిలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు కూడా పిస్తా పప్పును ఆహారంగా తీసుకోవచ్చు. పిస్తాపప్పును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా పిస్తా పప్పు మనకు సహాయపడుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి పిస్తాపప్పును తగి మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పిస్తాపప్పు రుచిగా ఉండడం వల్ల చాలా మంది దీనిని ఎక్కువ మోతాదులో తినేస్తూ ఉంటారు. పిస్తాపప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే తుమ్ముళ్లు, చర్మంపై దురద, దద్దుర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అధికంగా పిస్తాపప్పును తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. కనుక రోజూ 4 నుండి 5పిస్తాపప్పులను మాత్రమే ఆహారంగా తీసుకోవాలని అప్పుడే వాటి వల్ల కలిగే ప్రయోజనాలను మనం పూర్తి స్థాయిలో పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.