Dry Amla For Teeth : ప్రతి ఒక్కరు కూడా, అందమైన పళ్ళుని పొందాలని అనుకుంటుంటారు. పళ్ళు పుచ్చిపోవడం లేదంటే, పంటి సమస్యలు మొదలైనవి కలిగినట్లయితే, చూడడానికి బాగోదు. ముఖం అందంగా కనపడదు. పళ్ళు పుచ్చిపోకుండా, పళ్ళని కాపాడుకోవాలంటే, ఇలా చేయడం మంచిది. వక్క పొడి ని పురుషులు, స్త్రీలు ఎక్కువగా తింటుంటారు. ఈ వక్క పొడి తినేటప్పుడు, కాస్త మత్తు కలుగుతుంది. ఉత్సాహాన్ని కూడా వక్క కలిగిస్తుంది. ఎక్కువగా తినడం వలన, సమస్యలు ఉంటాయి. కొందరికి, ఇది వ్యసనంగా కూడా మారిపోతూ ఉంటుంది. ఈ వ్యసనాన్ని మానుకోలేక ప్రాణాలు ని కోల్పోయిన వాళ్లు కూడా, చాలామంది ఉన్నారు.
వక్క ని మానేయాలంటే లవంగాలని, యాలకుల్ని లేదంటే ధనియాలని తీసుకుంటే మంచిది. అలానే కొన్ని కొన్ని సార్లు, చాలామంది వక్కకి ఎడిక్ట్ అయిపోవడం వలన, తినకుండా ఉండలేకపోతుంటారు. అటువంటి వాళ్ళు, ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కల్ని ఉదయం నుండి సాయంత్రం దాకా, అలా తింటూ ఉంటే, పుల్లదనానికి అసలు ఏమీ కూడా తినాలని అనిపించదు.
ఇలా, ప్రతిరోజు చేయడం వలన వక్క పొడిని మానేయడానికి అవుతుంది. వక్క పొడి నోట్లో ఉండే దంతాలని, చిగుళ్ళని నాశనం చేస్తుంది. పళ్ళ మీద ఉండే ఎనామిల్ ని కూడా, ఇది తొలగించగలదు. వక్క ని తీసుకున్న కొన్ని రోజులకే పళ్ళ మీద ఎనామిల్ పోతుంది. నిజానికి ఈ ఎనామిల్ చాలా శక్తివంతమైనది.
1100 డిగ్రీల వేడిని కూడా ఈ ఎనామిల్ తట్టుకుంటుంది. కానీ, వక్కని తీసుకోవడం వలన, ఇది కొన్ని రోజులకే పోతుంది. ఈ వక్కపొడి వలన దంతాలు ఊడడం వంటివి కూడా జరుగుతాయి. వక్కపొడిని తినాలని అనుకున్నప్పుడు, మీరు వక్క ని మానేస్తే, దానికి బదులుగా ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కల్ని తీసుకోవడం మంచిది. అప్పుడు నెమ్మదిగా ఈ అలవాటు నుండి బయటకి వచ్చేయొచ్చు.