Garlic : మనలో చాలా మంది ఎటువంటి పని చేయకుండానే అలసిపోవడం, నీరసించి పోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఎటువంటి కారణాలు లేకుండానే తరచూ జబ్బు పడుతుంటారు. ఇలాంటి సమస్యల బారిన పడడానికి కారణం మన శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడమే. ఈ రోజుల్లో అసలే అనేక రకాల వైరస్ లతో ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారింది. ఈ వైరస్ లను ఎదుర్కొవాలంటే మన శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉండాలి. వ్యాధి నిరోధక శక్తి తగ్గే కొద్దీ వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.
ఎటువంటి మందులను వాడే అవసరం లేకుండానే కేవలం మన వంటింట్లో ఉండే పదార్థాలతోనే మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో వెల్లుల్లి మనకు సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు ప్రతిరోజూ ఉదయం పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తినాలి. వీటిని నేరుగా తినలేని వారు తేనెతో కలిపి తీసుకోవచ్చు.
ఈ విధంగా క్రమం తప్పకుండా వారం రోజుల పాటు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి తరచూ జబ్బుల బారిన పడకుండా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా వెల్లుల్లిని ఇలా తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మనం ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చని వారు తెలియజేస్తున్నారు. వెల్లుల్లిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పకుండా ఉంటాయి. తద్వారా రక్తప్రసరణ సాఫీగా సాగి గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. గొంతునొప్పితో బాధపడే వారు ఈ విధంగా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
వెల్లుల్లికి జీర్ణసంబంధిత సమస్యలను నయం చేసే గుణం కూడా ఉంటుంది. డయేరియాతో బాధపడే వారు వెల్లుల్లిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి సత్వరమే ఉపశమనం కలుగుతుంది. తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ ఫెక్షన్ ల బారిన పడే వారు వెల్లుల్లిని పరగడుపున తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ లబారిన పడకుండా ఉంటారు. ప్రతిరోజూ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మలినాలు, హానికారక క్రిములు తొలగిపోతాయి. ఈ విధంగా వెల్లుల్లి మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని క్రమం తపక్పకుండా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి తరచూ జబ్బుల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.