Makhana : తామర పువ్వులను సహజంగానే చాలా మంది పూజల్లో ఉపయోగిస్తుంటారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి కనుక తామరపూలను ఆమె పూజలో వాడుతుంటారు. అయితే తామర పువ్వుల నుంచి తీసిన గింజలను మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వీటినే ఫూల్ మఖనా అని పిలుస్తారు. తెలుపు రంగులో చిన్న గోళీకాయలంత సైజులో నల్లని మచ్చలతో ఇవి ఉంటాయి. ఇవి ఖరీదు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇవి అందించే ప్రయోజనాలు మాత్రం అమోఘమని చెప్పవచ్చు.
మఖనాలతో మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని ఉత్తర భారతదేశంలో చాలా మంది తీసుకుంటారు. వీటితో కూరలు, తీపి వంటకాలు చేసుకుంటారు. మఖనాలతో ఎక్కువ శాతం మంది పాయసం తయారు చేస్తారు. కొందరు దీన్ని దైవానికి నైవేద్యంగా కూడా పెడుతుంటారు. మఖనాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ఫూల మఖనాల ద్వారా ప్రయోజనాలు పొందాలంటే వాటిని రోజూ పాలతో తీసుకోవాల్సి ఉంటుంది. గసగసాలను కొద్దిగా తీసుకుని నెయ్యి కలిపి వేయించాలి. అనంతరం ఒక గ్లాస్ పాలను తీసుకుని అందులో అరకప్పు మఖనాలను వేయాలి. తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్న గసగసాలను వేయాలి. ఇప్పుడు పాలను బాగా మరిగించాలి. అనంతరం ఆ మిశ్రమంలో కొద్దిగా పటిక బెల్లం పొడి కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పూట తాగాల్సి ఉంటుంది. ఇలా వారంలో కనీసం మూడు సార్లు తాగితే ప్రయోజనం కలుగుతుంది. రోజు విడిచి రోజు దీన్ని తాగవచ్చు.
మఖనాలను పైన తెలిపిన విధంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా వీటిల్లో కాల్షియం బాగా ఉంటుంది. దీంతో ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. ఎముకల పెరుగుదల బాగుంటుంది. ఎముకలు విరిగిన వారు ఈ మిశ్రమాన్ని తాగితే త్వరగా అవి అతుక్కుంటాయి.
మఖనాలలో మెగ్నిషియం, జింక్, కాపర్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి. వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.
మఖనాలను తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. యవ్వనంగా కనిపిస్తారు. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. చర్మంపై ఉండే మచ్చలు పోతాయి. ముఖంపై ముడతలు తగ్గుతాయి.
ఈ మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. శరీరం హాయిగా అనిపిస్తుంది. ప్రశాంతత లభిస్తుంది.
ఈ మిశ్రమాన్ని తాగితే కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి. రాత్రి పూట ఈ మిశ్రమాన్ని తాగుతారు కనుక నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
మఖనాలలో యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. కనుక జ్వరం రాకుండా ఉంటుంది. షుగర్ ఉన్నవారు పటిక బెల్లం లేకుండా ఈ మిశ్రమాన్ని తాగవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
ఈ మిశ్రమాన్ని తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసుకోవచ్చు. నీరసంగా అనిపించే వారు, బలహీనంగా ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగితే శక్తి లభిస్తుంది. చురుగ్గా మారుతారు. యాక్టివ్ గా పనిచేస్తారు.
ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది సంతానం కలిగే అవకాశాలను మెరుగు పరుస్తుంది.