Tomato Juice : టమాటాల నుండి మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను పొందవచ్చు. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టామాటాల్లో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం, గుండె, కళ్లకి సంబంధించిన ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి ఉపయోగపడతాయి. ఈ టామాటో జ్యూస్ ని బ్రేక్ ఫాస్ట్ తోపాటు తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో తేలికగా ఉండడంతోపాటు రోజంతా యాక్టివ్ గా ఉండగలుగుతారు. ఇక టామాటో జ్యూస్ తో ఇంకా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం రోజూ చేసుకునే వంటల్లో టమాటాలని చాలా రకాలుగా వాడుతూనే ఉంటాం. టమాటా లేనిదే వంటింట్లో పని పూర్తవదు. అయితే ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని మనలో చాలా మందికి తెలియదు. మనిషి శరీరానికి అత్యంత అవసరమైన అద్భుతమైన పోషక గుణాలు టమాటాల్లో ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని మామూలుగా వంటల్లో కంటే జ్యూస్ రూపంలో తాగడం వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయని సలహా ఇస్తున్నారు.

టమాటా జ్యూస్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండ వల్ల చర్మం పాడవడం, ముఖంపై కలిగే మొటిమలు, నల్లని చర్మం మొదలైన సమస్యలకు టమాటా జ్యూస్ పరిష్కారం చూపిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇది చర్మ రంధ్రాలను తెరుచుకునేలా చేసి చర్మ గ్రంథుల నుండి ఉత్పత్తి అయ్యే జిడ్డుని అదుపులో ఉంచుతుంది. దాని వల్ల చర్మంపై నిగారింపు వస్తుంది. టమాటాలలోని విటమిన్లు, ఐరన్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. తరచూ టమాటా జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. దీనిలోని పీచు పదార్థాలు అజీర్తి, మలబద్దకం లాంటి ఇబ్బందుల్ని దూరం చేస్తాయి.
టమాటా జ్యూస్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీనిలోని విటమిన్ సి, విటమిన్ ఎ, బీటా కెరోటిన్‌లు, లైకోపిన్లు రక్త నాళాలను బలపరుస్తాయి. పరిశోధనల ప్రకారం రోజూ టమాటాలని తీసుకోవడం వల్ల శరీరంలో మంటలు రావడం తగ్గుతుంది. అలాగే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. టమాటాల్లో ఉండే లుటిన్, జియాగ్జాంతిన్ లు కళ్లను నీలి కిరణాల నుండి కాపాడతాయి. టమాటాలను తరచూ తినే వారి కళ్లు ఎక్కువ కాలం సమస్యలు లేకుండా పనిచేస్తాయని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. అంతే కాకుండా కళ్లకు సంబంధించిన ఇంకా ఎన్నో రకాల అనారోగ్యాలను మన దరిచేరనివ్వదు.
టామాటాలలో ఉండే లైకోపీన్ దంతాలు, చిగుళ్ల సమస్యలను తగ్గిస్తుంది. నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఒక టమాటాను ఇంకా ఒక క్యారెట్ ను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలకు కొన్ని వాము ఆకులు, కొద్దిగా మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు ను కలిపి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్టులా అయిన తరువాత గ్లాసులోకి తీసుకుంటే తాగడానికి సిద్ధమైనట్లే. దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో రోజూ తీసుకుంటే.. పైన తెలిపిన ప్రయోజనాలను పొందవచ్చు.