Anemia : మనల్ని వేధిచే అనారోగ్య సమస్యల్లో రక్తహీనత సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు కూడా మనలో చాలా మంది ఉండే ఉంటారు. రక్తంలో ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. పోషకాహార లోపమే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం. ఈ సమస్యతో బాధపడే వారిలో శరీర భాగాలకు ఆక్సిజన్ కూడా సక్రమంగా అందదు. దీంతో నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడం, హృదయ స్పందనల్లో హెచ్చు తగ్గులు రావడం వంటి అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రక్తహీనత సమస్యను నిర్లక్ష్యం చేస్తే గుండె, మెదడు వంటి అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది.
ఈ సమస్య మరీ ఎక్కువైతే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. మన ఇంట్లో ఒక పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల రక్తహీనత సమస్య నుండి మనం బయటపడవచ్చు. రక్తహీనత సమస్యను తగ్గించే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీనిని ఎలా వాడాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తాగడం వల్ల రక్తహీనత తగ్గడంతో పాటు మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. రక్తహీనత సమస్యను తగ్గించే ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం నల్ల ఎండు ద్రాక్షను ఉపయోగించాల్సి ఉంటుంది. ఎండు ద్రాక్షలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఈ నీటిలో 10 నుండి 20 ఎండు ద్రాక్షలను వేయాలి. తరువాత ఈ నీటిని 5 నుండి 7 నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రాత్రి పడుకునే ముందు ఈ నీటిని మరిగించి దానిపై మూతను ఉంచి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని ఒక గ్లాస్ లోకి తీసుకుని తాగాలి. అలాగే ఈ ఎండు ద్రాక్షను ఉదయం అల్పాహారంతో తీసుకోవాలి. రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఇలా నీళ్లల్లో మరిగించిన ద్రాక్షను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ఎండు ద్రాక్షను నీళ్లల్లోనే కాకుండా పాలల్లో వేసి మరిగించి కూడా తీసుకోవచ్చు.
ఎండుద్రాక్షతో చేసిన పానీయాన్ని తీసుకోవడం వల్ల మలబద్దకం, గ్యాస్, ఎసిడిటివంటి సమస్యలు కూడా తగ్గుతుంది. ఉదయం పూట ఈ పానీయాన్ని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఎండుద్రాక్షతో చేసిన ఈ పానీయాన్ని తాగడం వల్ల నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది. ఎముకలు ధృడంగా మారి కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కాలేయంలోని మలినాలు తొలగిపోయి కాలేయం శుభ్రపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఈ విధంగా ప్రతిరోజూ ఎండు ద్రాక్షతో చేసిన పానీయాన్ని తాగడం వల్ల సమస్య తగ్గడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.