Saffron : చలికాలం సరైన దశకు చేరుకుంది. విపరీతమైన చలితో ప్రజలు వణుకుతూ అనేక అవస్థలకు గురవుతున్నారు. తీవ్రమైన చలి ప్రభావం వల్ల అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. మరోవైపు కరోనా ముప్పు మనల్ని మళ్లీ తరుముతోంది. ఈ సమయంలో మన ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
కరోనా ఒక వైపు.. మరోవైపు చలికాలం శ్వాస కోశ సమస్యలు.. వెరసి అనేక మంది తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ దశలో రోగాల నుంచి శరీరాన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే అందుకు మెడికల్ షాపుకు వెళ్లి మందులను కొని తెచ్చి వేసుకోవాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధ పదార్థమైన కుంకుమ పువ్వుతోనూ రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచుకోవచ్చు. అందుకు గాను కుంకుమ పువ్వును రోజూ పలు విధాలుగా తీసుకోవచ్చు.
కుంకుమ పువ్వులో అనేక పోషక విలువలు, ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని ఆయుర్వేదంలో పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. వంటల్లో కుంకుమ పువ్వును వేస్తుంటారు. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి.
కుంకుమ పువ్వు వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గర్భిణీలు దీన్ని రోజూ పాలలో కలిపి తీసుకుంటే బిడ్డకు పోషకాలు సరిగ్గా లభిస్తాయి. పుట్టబోయే బిడ్డలో లోపాలు రాకుండా ఉంటాయి. ఇక ఇతరులు ఎవరైనా సరే కుంకుమ పువ్వు ఒక రెక్కను రోజూ పాలలో కలిపి రాత్రి నిద్రకు ముందు తాగవచ్చు. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు.
కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మెటబాలిజంను క్రమబద్దీకరిస్తాయి. దీంతో క్యాలరీలు సులభంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.
రోజూ మనం తినే ఆహారంలో కుంకుమ పువ్వును కలిపి తీసుకోవచ్చు. లేదా రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక కుంకుమ పువ్వు రెక్కను కలిపి తాగవచ్చు. లేదా ఒక గ్లాస్ నీటిలో ఒక కుంకుమ పువ్వు రెక్కను వేసి కొన్ని గంటల పాటు అలాగే ఉంచి తరువాత ఆ నీటిని తాగవచ్చు. ఇలా కుంకుమ పువ్వును తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, కంగారు, డిప్రెషన్ వంటి మానసిక సమస్యల నుంచి బయట పడవచ్చు. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. పురుషులు శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి.