గుండె జబ్బులు రాకుండా వుండాలంటే, ప్రధానంగా ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. ఒక పోషకాహార నిపుణుడిని సంప్రదించి గుండెకు ఆరోగ్యం కలిగించే ఆహారాలను తెలుసుకొని వాటిని ప్రణాళిక చేయాలి. ప్రతి 1000 కేలరీలకు కనీసం 14 గ్రాముల పీచు పదార్ధం ప్రతిరోజు తినే ఆహారంలో వుండేలా చూడాలి. పీచు వుంటే చెడ్ కొల్లెస్టరాల్ తగ్గుతుంది.
ఆహారంలో ఓట్లు, బ్రౌన్ బ్రెడ్, ఎండు బీన్స్, పండ్లు, బఠాణీలు, కూరలు మొదలైనవి అధిక పీచు కలిగి వుంటాయి. కొల్లెస్టరాల్ స్ధాయి పెంచే కొవ్వులు వదలండి. ఇవి రెడ్ మీట్, బటర్ ఘీ, డైరీ ప్రాడక్ట్ వంటివిగా వుంటాయి. కొల్లెస్టరాల్‌లో రోజుకు 300 మి.గ్రా కన్నా అధికంగా వుండరాదు. ప్రతిరోజు తినే ఆహారంలో కార్బో హైడ్రేట్లు 60 శాతం వరకు మాత్రమే వుండేలా చూడండ. అన్నింటినీ మించి రోజువారీ కార్యక్రమాలలో వ్యాయామం లేదా నడక, స్విమ్మింగ్, సైకిలింగ్, ట్రెడ్ మిల్ వంటివి కనీసం 30 నిమిషాలపాటు తప్పక చేయాలి.
వీటిని కనీసం వారానికి 5 లేదా 6 రోజులు చేయాలి. ఏ వ్యాయామమైనా సరే ఖచ్చితంగా తీవ్రంగా చేసే ముందు శారీరక పరీక్షలకై వైద్యుని సంప్రదించాలి. అధిక బరువు ఇప్పటికే వున్నవారు సరైన బరువుకై తప్పక కృషి చేయాలి. దీనికిగాను బాడీ మాస్ ఇండెక్స్ సరిచూసుకుంటూ శారీరక అధిక బరువును ఒకే సారి వేగంగా కాకుండా క్రమేణా తగ్గించాలి.