2025 నాటికి ప్రపంచ డయాబెటిక్ రోగులలో 80 శాతం భారతదేశంలోనే వుండగలరని అంచనాలు చెపుతున్నాయి. దీనికి కారణం మనకు లభ్యమవుతున్న ఆహార పదార్ధాలే! కార్బో హైడ్రేట్లు అధికంగా వుండటం పీచు పదార్ధాలు తక్కువగా వుండటం కారణ మంటారు పోషకాహార నిపుణులు. సాధారణంగా మనం ఉదయం పూట తినే బ్రేక్ ఫాస్టులోని పరోటా, పూరి, రోటి, బ్రెడ్ మొదలైన వాటిలో గ్లైస్మిక్ స్ధాయి అధికంగా వుంటుందని, గ్లైస్మిక్ స్ధాయి తక్కువగా వుండే ఫైబర్ పదార్ధాలు గత కొన్ని సంవత్సరాలుగా తింటున్న వారకి టైప్ 2 డయాబెటీస్ ఏ మాత్రం దగ్గరికి రావటం లేదని వీరు అభిప్రాయపడుతున్నారు.
భోజనంలో పిండి పదార్ధాలు, కార్న్ ఫ్లేక్స్, గోధుమ, రైస్ మొదలైనవి వుండరాదంటారు డయాబెటాలజిస్ట్ గౌరవ్ శర్మ. ఈ పదార్ధాలు అధికమైన స్టార్చ్ ను కలిగి వుంటాయని ఇవి తినే వారికి డయాబెటీస్ వ్యాధి అధికమవుతుందని చెపుతారు. మరి డయాబెటిక్స్ ఏమి తినాలి ? బ్రేక్ఫాస్ట్ లో కోడిగుడ్లు, బాగా వేయించినవి, వీలైతే ఆలివ్ ఆయిల్ వేయబడి తయారు చేసిన ఆమ్లెట్లు, పక్కనే టొమాటోలు, కొత్తిమీర, వీటితో పాటు హెర్బల్ లేదా జాస్మిన్ టీ లాంటివి తీసుకోవాలని ఈ నిపుణులు చెబుతారు.
అందరూ అనుకునేట్లు కోడిగుడ్లు కొల్లెస్టరాల్ లెవెల్ పెంచవని చెబుతున్నారు. శర్మ గత రెండు దశాబ్దాలుగా లైఫ్ స్టైల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ అనేక యాంటీ డయాబెటిక్ ఆహార ప్రణాళికలను ప్రముఖులకు అందించారు. ప్రతి కుటుంబం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కల మూడు రకాల నూనెలను వంటలకు వాడాలంటాడు. వీలైనంతవరకు జంక్ ఫుడ్లు వదిలి వేయాలని, తక్కువ మసాలాలు వున్న ఆహారాలను తీసుకోవాలని చెబుతారు.