హెల్త్ టిప్స్

టీతో పాటు రస్క్స్ తీసుకోవ‌డం ఆరోగ్యానికి ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలుసా?

ఈ రోజుల్లో మ‌నం ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా కూడా లేని పోని స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేరుతున్నాయి. ఉదయం లేచిన ద‌గ్గ‌ర నుండి రాత్రి ప‌డుకునే వ‌ర‌కు మ‌నం ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అయితే చాలా మంది ఉదయం లేచాక కప్పు టీ పక్కనే రెండు మూడు రస్కులు పెట్టుకుని తినడానికి రెడీగా ఉంటారు . ముఖ్యంగా మ‌న తెలుగు రాష్ట్రాల‌లో వీటి కాంబినేష‌న్‌ని ఇష్ట‌ప‌డే వారి సంఖ్య చాలా ఎక్కువ‌. అయితే అలా తినడం వల్ల ఆరోగ్యం పై కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయని, అందుకే ఆ కాంబినేషన్ ను దూరం పెట్టమని వివరిస్తున్నారు.రస్కులను బ్రెడ్ తో తయారు చేస్తారు. బ్రెడ్ ని తయారు చేశాక వాటిని మళ్లీ కాల్చి, క్రిస్పీగా మారేవరకు కాలుస్తూనే ఉంటారు.

అవి బంగారు రంగులో క్రిస్పీగా మారిన త‌ర్వాత రస్కులుగా మారుతాయి. అంటే రెండుసార్లు బేకింగ్ ప్రక్రియను అలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. బ్రెడ్ కు మరో రూపమే రస్క్. వీటిని పాలల్లో ముంచినప్పుడు మెత్తబడి సులువుగా తినేందుకు వీలుగా అవుతాయి.రస్కులు తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. రస్కుల్లో షుగర్, గ్లూటెన్ కలుపుతారు. రుచికరంగా ఉండటం కోసం వీటిని ఎక్కువ మోతాదులో మిక్స్ చేస్తారు. కానీ వీటిని టీలో ముంచుకుని తినడం వల్ల.. గ్యాస్, కడుపులో ఇబ్బందిగా అనిపించడం, ఉబ్బరం, కొంత మందిలో విరేచనాల సమస్య కూడా కనిపిస్తుంది. రస్కులు జీర్ణం అవడానికి చాలా సమయం పడుతుంది.రస్కుల తయారీలో వాడే నూనె కూడా మంచిది కాదు. ఇలా తిన‌డం వ‌ల‌న కిడ్నీ సమస్యలను, చర్మ సమస్యలను తీసుకువచ్చే ప్రమాదం ఉంది. రస్కులలో యాంటీ న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం పోషకాలు సంగ్రహించకుండా అడ్డుకుంటుంది.

tea with rusks it is dangerous to take for health

అలాగే రెగ్యులర్ గా టీ తో కాంబినేషన్ గా రస్కులు తీసుకోవడం వలన పేగులకి పొక్కులు సమస్యని కలిగిస్తాయి. మ‌రోవైపు రస్క్‌ల తయారీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియోలో రస్క్‌ల తయారీని చూపించారు. పిండి, పామాయిల్, చక్కెర వంటి అనారోగ్యకర పదార్థాలతో రస్క్‌లను తయారు చేస్తున్నారు. పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో ఈ రస్క్‌లను తయారు చేస్తున్నారు. వాటిని తయారు చేసే వారు కూడా ఎలాంటి గ్లౌస్ ఉపయోగించకుండా, శుభ్రత లేకుండా పని చేస్తున్నారు.రస్కులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఫుడ్ ఎడిటింగ్ ప్రెజర్వేటివ్ లు కలుపుతారు. అందుకే రస్కులు ఎక్కువగా తింటే స్థూలకాయం సంభవిస్తుంది. కాబట్టి టీ కాంబినేషన్ తో రస్కులు వాడకపోవడం మంచిది.రస్క్‌ను కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడేవారు తీసుకోకుండా ఉండాలి. ఉదరకుహర వ్యాధితో బాధ పడేవారు.. రస్క్‌లు తింటే వాపులు, నొప్పి, విరేచనాలు కలుగుతాయి.

Sam

Recent Posts