ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరైనా సరే రోజూ అన్ని పోషకాలు కలిగిన పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నారులు, పెద్దలు వారి శరీర అవసరాలకు తగిన విధంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. కానీ టీనేజ్ వయస్సులో ఉన్నవారు మాత్రం ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి. వారికి ఆ వయస్సులో పోషకాలు అధికంగా అవసరం అవుతాయి. కనుక తల్లిదండ్రులు వారికి అధిక పోషకాలు కలిగిన ఆహారాలను అందించాలి. ఈ క్రమంలోనే అలాంటి ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. పాలు
పాలలో కాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్, ప్రోటీన్లు, విటమిన్ బి12 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి టీనేజ్ వయస్సులో ఉన్నవారి పెరుగుదలకు దోహదపడతాయి. వారి ఎముకలను దృఢంగా మారుస్తాయి. పాలతోపాటు సోయా మిల్క్ కూడా తీసుకోవచ్చు. దీంతో వారికి రోజూ కావల్సిన కాల్షియం బాగా అందుతుంది.
2. ఆకుకూరలు, కూరగాయలు
చాలా మంది టీనేజ్ వయస్సు వారు ఆకుకూరలు, కూరగాయలను తినేందుకు ఇష్టపడరు. కానీ కచ్చితంగా వారు వాటిని తినాలి. వాటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వారి ఎదుగుదలకు అవసరం అయ్యే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ క్రమంలోనే టీనేజ్ వయస్సు ఉన్నవారు రోజూ బ్రొకొలి, పాలకూర, పచ్చి బఠానీలు, బీన్స్ వంటి కూరగాయలను తీసుకోవాలి. దీంతో శక్తి లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ అవసరం అయ్యే పోషకాలు అందుతాయి.
3. కోడిగుడ్లు
కోడిగుడ్లలో ప్రోటీన్లు, శరీరానికి అవసరం అయ్యే విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఎదుగుదలకు అవసరం అయ్యే జింక్, విటమిన్లు ఎ, ఇ, సెలీనియం ఉంటాయి. ఇవి పోషణను అందిస్తాయి. రోజూ ఉదయాన్నే ఉడకబెట్టిన కోడిగుడ్లను తింటే పోషణ, శక్తి లభిస్తాయి. దీని వల్ల టీనేజ్ వయస్సు వారి ఎదుగుదల సరిగ్గా ఉంటుంది.
4. అరటి పండ్లు
మన శరీరానికి అరటి పండ్లు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అరటి పండ్లలో బి విటమిన్లు, పొటాషియం, ఫైబర్, కార్బొహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి టీనేజ్ వయస్సు వారిని యాక్టివ్గా ఉంచుతాయి. శక్తిని అందిస్తాయి. రోజూ స్నాక్స్ సమయంలో అరటి పండ్లను తింటే ప్రయోజనం ఉంటుంది.
5. చేపలు
చేపలను తినే యుక్త వయస్సు వారికి ఆ ఆహారాన్ని తరచూ పెట్టడం మంచిది. దీని వల్ల చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వారికి అందుతాయి. దీంతో వారి మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. చురుగ్గా మారుతుంది. చదువుల్లో రాణిస్తారు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
6. నట్స్
టీనేజ్ వయస్సు వారు రోజూ నట్స్ ను కచ్చితంగా తీసుకోవాలి. వీటిల్లో జింక్, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్ ఇ లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శక్తిని, పోషణను అందిస్తాయి. వీటిని రోజూ స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు.
7. చిలగడ దుంపలు
చిలగడ దుంపలు టీనేజ్ వయస్సు వారికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిని, పోషణను అందిస్తాయి. అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి. అందువల్ల టీనేజ్ వయస్సు వారు వీటిని తరచూ తీసుకోవాలి.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365