Food Combinations : మనం రుచిగా ఉంటాయని కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తీసుకుంటాము. వివిధ రకాల ఆహార పదార్థాలను నేరుగా తినడానికి బదులుగా ఇతర ఆహారాలతో కలిపి తింటే వాటి రుచి మరింత పెరుగుతుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం కొన్ని విరుద్ధ ఆహారాలు ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. విరుద్ధ ఆహారాలను తీసుకోవడం వల్ల కొన్నిసార్లు వాటి ఫ్రభావం వెంటనే కనిపించదు. కొంతకాలం తరువాత వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలు మన శరీరంలో కనిపిస్తాయి. అలాగే విరుద్ధ ఆహారాలను తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కనుక మనం విరుద్ద ఆహారాలను తీసుకోకూడదు. మనం తీసుకోకూడని ఆ విరుద్ద ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలల్లో నిమ్మకాయ పిండితే పాలు విరిగిపోతాయన్న సంగతి మనకు తెలిసిందే. పాలను, నిమ్మకాయను కలిపి వండే పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే వీటిని వెంటవెంటనే కూడా తీసుకోకూడదు. అలాగే కొన్ని వంటకాల్లో పాలు పోసి వండుతారు. అలాగే ఆ వంటకాల్లో ఉప్పు వేసి వండుతూ ఉంటారు. ఇలా పాలు, ఉప్పు కలిపిన వంటకాలను తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అదే విధంగా పాలల్లో పంచదార తప్ప ఏ ఇతర ఆహారాలను కలిపి తినకూడదు. అలాగే పాలతో పాటు మాంసాహారాన్ని కూడా కలిపి తీసుకోకూడదు. పాలల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మాంసాహారంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని ఒకే సమయంలో తీసుకోవడం వల్ల హైబీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
అలాగే ఎసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పాలతో కలిపి చికెన్, గుడ్లు వంటి మాంసాహారాన్ని తీసుకోకూడదు. అలాగే పాలు, అరటి పండును కూడా కలిపి తీసుకోకూడదు. వీటిని వేరువేరుగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ వీటిని కలిపి తీసుకోవడం వల్ల కళ్లు తిరగడం, కళ్లు మసకగా కనబడడం వంటివి జరుగుతాయి. అరటి పండే కాదు పాలతో కలిపి ఏ ఇతర పండ్లను కూడా తినకూడదు. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన పండ్లను అస్సలు తినకూడదు. పాలతో పాటు సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకోవడం వల్ల కఫం ఎక్కువగా తయారవుతుంది. అలాగే అలర్జీ, దురద వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అదే విధంగా పెరుగుతో అరటి పండు, మాంసం, టమాటాలు, మినపప్పు వంటి వాటిని తీసుకోకూడదు. అంతేకాకుండా పెరుగుతో పుల్లటి పండ్లను కలిపి తీసుకోకూడదు.
దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, దగ్గు, జలుబు, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడే వారు పెరగు వడ వంటి వాటిని అస్సలు తీసుకోకూడదు. అలాగే పెరుగు తిన్న తరువాత టీ ని అస్సలు తాగకూడదు. వీటిలో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిని వెంటవెంటనే తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే చాలా మంది బీర్, కూల్ డ్రింక్స్ వంటి వాటితో స్నాక్స్ గా ఉప్పు చల్లిన పదార్థాలను తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ కు గురి అవుతుంది. శరీరంలో సోడియం శాతం పెరిగి నీటి శాతం తగ్గుతుంది. దీని వల్ల వాంతులు, వికారం, పొట్ట అధికంగా పెరగడం వంటివి జరుగుతాయి. అలాగే తేనెను, నెయ్యిని సమానంగా కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల ఆహారం విషతుల్యం అయ్యే అవకాశం ఉంది. అలాగే తేనెను వేడి పదార్థాలతో కలిపి తీసుకోకూడదు.
అంతేకాకుండా వేడి పదార్థాలను, చల్లటి పదార్థాలను కలిపి వెంట వెంటనే తీసుకోకూడదు. అలాగే చాలా మంది కీరదోసను, టమాటాలను కలిపి తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే చాలా మంది సలాడ్ లల్లో క్యారెట్ తో పాటు నిమ్మరసాన్ని వేసుకుని తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల గుండెలో మంటతో పాటు మూత్ర సంబంధిత సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఈ విధంగా విరుద్ద ఆహారాలను తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కనుక ఈ పదార్థాలను కలిపి తీసుకోకూడదు. ఈ పదార్థాలను కనీసం గంట నుండి రెండు గంటల వ్యవధితో తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.