హెల్త్ టిప్స్

ఈ సంకేతాలు కనపడుతున్నాయా..? అయితే నీరు ఎక్కువ తాగ‌ట్లేదని అర్థం..!

ఆరోగ్యంగా ఉండడానికి నీళ్లు కూడా చాలా ముఖ్యం. మనం నీళ్లు సరిగా తీసుకోకపోతే డీహైడ్రేషన్ వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీళ్లు ఎక్కువ తాగట్లేదని ఎలా తెలుస్తుంది..? చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది. ఇలా నీళ్లు తాగట్లేదు అని మనం తెలుసుకోవచ్చు. నీరసం, బలహీనతతో బాధపడే వాళ్ళు నీరు తక్కువ తీసుకుంటున్నారని అర్థం.

ఆ సమస్యలు ఉంటే నీళ్లు ఎక్కువ తీసుకోవాలి. అలాగే నోరు ఆరిపోవడం, నోటి నుంచి దుర్వాసన రావడం, డార్క్ గా యూరిన్ ఉండడం, మలబద్ధకం, కళ్ళు తిరుగుతున్నట్లు ఉండడం, చర్మ సమస్యలు కూడా నీళ్లు తక్కువ తీసుకుంటున్నారని చెప్పే సంకేతాలు. ఇవి కనపడితే నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.

these signs indicate that you are not drinking water enough

కండరాల నొప్పులు, ఆకలిలో మార్పులు, గుండె కొట్టుకోవడంలో కూడా మార్పులు రావడం నీరు తక్కువ తాగుతున్నారని చెప్పే సంకేతాలు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ 8 నుంచి 10 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. పుచ్చకాయ, కీరాదోస వంటివి తీసుకుంటే కూడా నీరు ఎక్కువ అందుతుంది. షుగర్ ఉండేవి తాగొద్దు. అలాగే కెఫీన్ కి కూడా దూరంగా ఉండాలి.

Peddinti Sravya

Recent Posts