మన శరీరంలో అన్ని అవయవాల్లాగే పెద్ద పేగు కూడా తన పనులను తాను నిర్వర్తిస్తుంది. చిన్నపేగు నుంచి వచ్చే మలాన్ని పెద్ద పేగు బయటకు పంపుతుంది. వ్యర్థాలను బయటకు పంపుతూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే పెద్ద పేగును ఆరోగ్యంగా ఉంచుకుంటేనే వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. కనుక పెద్ద పేగును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన సూచనలు పాటించాలి.
1. రోజూ ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. దీంతో పెద్ద పేగులో ఉండే వ్యర్థాలన్నీ సులభంగా బయటకు వస్తాయి. పెద్ద పేగు శుభ్రమవుతుంది.
2. అవిసెగింజలు, చియా సీడ్స్ వంటి గింజలను రోజూ తీసుకుంటుండాలి. దీంతో కూడా పెద్దపేగు ఆరోగ్యంగా ఉంటుంది.
3. రోజూ ఉదయం పరగడుపునే ఒక టీస్పూన్ అల్లం రసం సేవించాలి. లేదా రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు నీటిలో అల్లం వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. దీంతో పెద్ద పేగులోని వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. పెద్దపేగు శుభ్రమవుతుంది.
4. రోజూ ఆహారంలో పాలు, పెరుగు వంటి పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియాకు తోడ్పాటు అందుతుంది. దీంతో పెద్ద పేగు శుభ్రమవుతుంది.
5. ఉదయం పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే పెద్దపేగు మాత్రమే కాకుండా జీర్ణవ్యవస్థ మొత్తం శుభ్రమవుతుంది.
ఇలా పెద్ద పేగును శుభ్రం చేసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365