హెల్త్ టిప్స్

రాత్రిపూట ఉద్యోగాలు చేసే వారికోసం..!

ఈ నిఖిలచరాచరాలలో అన్ని జీవరాశులు ప్రకృతికి అనుసంధానంగా , ప్రకృతిని అనుసరించే ఉంటాయి, ఒక్క మానవుడు తప్ప . ఈ కలియుగంలో వ్యతిరేఖ భావాలు, వ్యతిరేఖ మనస్తత్వాలు, వ్యతిరేఖ జీవనం సహజమైపోయింది. ఈ వ్యతిరేఖ జీవనం పోషణ కోసం కొందరు సాగిస్తుంటే, విలాసాలకోసం మరికొందరు సాగిస్తున్నారు. ఏది ఏమైనా ఎవరైతే ప్రకృతికి వ్యతిరేఖంగా జీవిస్తారో వారు అనారోగ్యాల భారిన పడక తప్పదు.నిప్పును తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకునా కాలక తప్పదు. అందుకే ఆనాటితో పోల్చుకుంటే నేడు రోగాల సంఖ్య, రోగుల సంఖ్య వాటితో పాటు అరకొరగా చదివి పాసయిన డాక్టర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది.

అయితే ఈనాడు పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేయటానికి ఉద్యోగావకాశాలు కూడా అలగే వున్నాయి, కుటుంబ పో్షణకోసమో , అధిక ధనసంపాదనకోసమో రాత్రి పూట పని చేయటానికి పరుగులు తీస్తున్నారు. బ్రతకటానికి ఉద్యోగం చేయాలి కాబట్టి , ఇష్టం లేకపోయినా కష్టమైనా కొంతమంది రాత్రిపూట ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది.అలాంటి వారు ఈ క్రింది నియమాలను పాటించాలి. రాత్రిపూట జీవశక్తి అధికంగా ఉంటుంది. ఆ సమయంలో శరీరం విశ్రాంతిలో ఉండటం వలన జీవశక్తిని నరనారన నింపుకో్వటానికి అవకాశం దొరుకుతుంది.అందువలన ప్రత్యామ్నాయంగా వీలయినప్పుడల్లా ధ్యానం చేయాలి.

those who are working in night shift follow these

ఉదయం గానీ , సాయంత్రం గానీ యోగాసనాలు తప్పకుండా వేయాలి. ఉదయం , రాత్రి బాగా తినాలి. బాగా నమిలి తినాలి, ఎందుకంటే పగటి నిద్ర అవసరం కాబట్టి,త్వరగా అరగాలి కాబట్టి . అలా తినకపోతే అజీర్ణం తద్వారా షుగరు, గ్యాసు, వాత నొప్పులు , సుఖవిరేచనం కాకపోవటము మొదలైన చాలా సమస్యలు వస్తాయి. తినగానే వెంటనే నిద్రపోకూడదు. మధ్యాహ్నం అల్పాహారం తినాలి. అతిగా తినకూడదు. తినే ముందు , తిన్నవేంటనే నీళ్లు తాగకూడదు. ఆహారం తినే 40 నిముషాల ముందు , తిన్న తరువాత 40 నిముషాల వరకు నీళ్ళు త్రాగరాదు.అత్యవసరం అనిపిస్తే రెండు మూడు బుక్కలు తాగవచ్చు. రాత్రి తినగానే పనికి ఉపక్రమించరాదు.

పైన చెప్పిన విధం గా ఆహారం తీసుకుని , రాత్రి ఎన్ని గంటలు నిద్రపోతారో, పగలు అంతకంటే ఎక్కువ సేపు నిద్రపోవటమో లేదంటే కొంత సమయం ధ్యానం చేయటమో చేయాలి. అతి ముఖ్యమైనది. తప్పక బ్రతుకు తెరువు కోసం రాత్రిపూట ఉద్యోగం చేయాల్సి వస్తుందని ప్రకృతిమాతకు క్షమాపణ చెప్పుకుని ఆరోగ్యం కాపాడమని ప్రార్ధించాలి. రాత్రి పూట ఉద్యోగాలు చేసే వారికి , గ్యాస్ , అజీర్ణం, పొట్ట ఉబ్బరం, పొట్ట పెద్దది అవటం, కీళ్ల నొప్పులు సమస్యలు అధికంగా వుంటాయి. దానికి ఇంటివైద్యం లో వాము, మిరియాలు సైంధవలవణం తో ఒక మంచి ఔషధం ఉంది , చూసి , చేసుకుని వాడుకోవ‌చ్చు.

Admin

Recent Posts