Types Of Salts : మనం రోజూ వంటల్లో ఉప్పును వాడుతుంటాం. ఉప్పు లేనిదే అసలు ఏ వంట కూడా పూర్తి కాదు. ఉప్పును మనం ఎంత తక్కువగా తింటే అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. అయితే వాస్తవానికి మనం రోజూ వాడే ఉప్పుతోపాటు ఇంకా ఉప్పులో అనేక వెరైటీలు ఉంటాయట. అవును, మీరు విన్నది నిజమే. ఉప్పులోనూ పలు రకాలు ఉంటాయని, వాటి రకాన్ని బట్టి మనకు ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక ఉప్పులో ఎన్ని రకాలు ఉన్నాయో, వాటితో మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పులో సెల్టిక్ సాల్ట్ అనే ఉప్పు కూడా ఉంటుంది. ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని కాస్త ఎక్కువగా వాడినా ఏమీ కాదు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు, బీపీ ఉన్నవారు ఈ ఉప్పును వాడవచ్చు. ఇక బ్లాక్ సాల్ట్ కూడా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇందులోనూ సోడియం పరిమాణం తక్కువగానే ఉంటుంది. దీన్ని వాడితే కడుపు ఉబ్బరం, అజీర్తి, కడుపు నొప్పి, వికారం, గుండెల్లో మంట వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే ఈ ఉప్పులో ఉండే పొటాషియం, మెగ్నిషియం, క్యాల్షియం, జింక్ మనకు పోషణను అందిస్తాయి.
ఇక కోషర్ సాల్ట్ అనే ఉప్పు కూడా ఉంటుంది. దీని స్ఫటికాలు పెద్ద సైజులో ఉంటాయి. అయితే ఇందులో అయోడిన్ తక్కువగా ఉంటుంది. మనం వాడే గల్లుప్పుకు ఇది దగ్గరగా ఉంటుంది. కనుక దీన్ని ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఇక మనకు మార్కెట్‌లో సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా ఉండే ఉప్పు కూడా లభిస్తుంది. ఇది బీపీ, గుండె సమస్యలు, కిడ్నీవ్యాధులు ఉన్నవారికి మేలు చేస్తుంది. అలాగే పింక్ సాల్ట్ కూడా లభిస్తుంది. దీన్ని మీరు చూసే ఉంటారు. రోడ్డు పక్కన దీన్ని మనం విక్రయదారుల వద్ద చూడవచ్చు. పింక్ సాల్ట్‌ను హిమాలయన్ సాల్ట్ అని కూడా అంటారు. ఇందులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పింక్ సాల్ట్‌లో ఉండే మెగ్నిషియం కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
పింక్ సాల్ట్‌ను తినడం వల్ల కాలి పిక్కలు పట్టుకోవడం అనే సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే ఈ సాల్ట్‌ను తింటే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీరంలో పీహెచ్ స్థాయిలు సరిగ్గా ఉంటాయి. అలాగే సముద్రపు ఉప్పు కూడా ఉంటుంది. దీన్నే మనం గల్లుప్పు అంటాం. ఇందులో అయోడిన్ తక్కువగా ఉంటుంది. కానీ మనం అయోడిన్ ఎక్కువగా ఉండే ఉప్పును వాడాల్సి ఉంటుంది. ఇలా మనకు పలు రకాల ఉప్పులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎవరైనా సరే తమకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే దాని ప్రకారం ఆయా ఉప్పులను వాడితే ప్రయోజనం ఉంటుంది. అయితే ఎలాంటి వ్యాధులు లేని వారు పింక్ సాల్ట్‌ను వాడితే ప్రయోజనకరంగా ఉంటుంది.