Vegetables For Cholesterol : చలికాలం ఆహ్లదకరంగా ఉన్నప్పటికి అనేక రకాల ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది. చలికాలంలో ఎక్కువగా గుండెపోటు, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. చలికాలంలో ఎక్కువగా శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల మనం చలికాలంలో గుండె సమస్యల బారిన పడకుండా ఉంటాము. చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం… చలికాలంలో ఎక్కువగా బచ్చలికూరను తీసుకోవాలి. దీనిలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బచ్చలికూర మనకు ఎంతో సహాయపడుతుంది.
అలాగే చలికాలంలో ఎక్కువగా చిలగడదుంపలను తీసుకోవాలి. వీటిలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా వీటిలో ఉండే బీటా కెరోటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో దోహదపడతాయి. అలాగే క్యాలీప్లవర్ ను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో ఎంతో దోహదపడుతుంది. ఇక ఫైబర్, బీటా కెరోటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న క్యారెట్లను కూడా మనం చలికాలంలో ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో బ్రోకలీ కూడా మనకు దోహదపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.
వీటితో పాటు బీట్ రూట్ లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. బీట్ రూట్ లలో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. రక్తపోటును తగ్గించడంలో, రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో ఇవి మనకు సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే చలికాలంలో టర్నిప్ లను వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, కడుపు నిండిన భావనను కలిగించడంలో సహాయపడుతుంది. ఒక క్యాలరీలు తక్కువగా, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాల్లో ముల్లంగి కూడా ఒకటి.
దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇక చలికాలంలో ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. దీనిని మనం వంటలల్లో విరివిగా వాడుతూ ఉంటాము. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ విధంగా ఈ ఆహారాలను చలికాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.