Warm Water For Belly Fat : మనలో చాలా మంది పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోయి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొందరూ శరీరమంతా సన్నగా ఉన్నప్పటికి పొట్ట భాగం లావుగా ఉంటుంది. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల కూడా అనేక ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడే వారు కూర్చోవడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి కారణాలుగా చెప్పవచ్చు. చాలా మంది పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
మార్కెట్ లో లభించే పౌడర్స్ ను, మందులను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఎటువంటి ఫలితం ఉండకపోగా భవిష్యత్తులో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మన వంటింట్లో ఉండే పదార్థాలతో ఒక కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించే కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు, పది తులసి ఆకులు, పది మిరియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ వాము, ఒక ఇంచు అల్లం ముక్కను కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని సగం గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించాలి.
తరువాత ఈ నీటిని వడకట్టి అందులో నిమ్మరసం వేసి గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం పరగడుపున కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ కషాయాన్ని తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు మనం ఇతర అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయని నిపుణులు చెబుతున్నారు.