Warm Water For Mucus : ప్రతి ఒక్కరు ఏదో ఒక్క సమయంలో దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు. వాతావరణం మారినప్పుడు, తాగే నీరు మారినప్పుడు, ప్రాంతం మారినప్పుడు ఇలా ఎప్పుడోకప్పుడు జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడుతూ ఉంటాం. చాలా మంది ఇటువంటి ఇన్ఫెక్షన్ ల బారిన పడగానే దగ్గు సిరప్ లను, యాంటీ బయాటిక్ మందులను వాడుతూ ఉంటారు. దగ్గు మందు అవసరం లేకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి ఇంట్లో ఉండే పదార్థాలతో చక్కటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ ఔషధౄన్ని మన అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకుని వాడవచ్చు. ఈ ఔషధాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం ఏడు రకాల పదార్థాలను ఉపయోగించాల్సి ఉంటుంది.
దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గించే ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని తయారు చేసుకోవడానికి గానూ 6 ఎమ్ ఎల్ కొబ్బరి నూనె, 1 ఎమ్ ఎల్ పిప్పర్ మెంట్ నూనె, 1 ఎమ్ ఎల్ లవంగం నూనె, 1 ఎమ్ ఎల్ దాల్చిన చెక్క, 1 ఎమ్ ఎల్ యూకలిప్టస్ నూనె, 1 గ్రాము పచ్చ కర్పూరాన్ని, 1 గ్రాము వాము పువ్వును ఉపయోగించాల్సి ఉంటుంది. వీటన్నింటితో తయారు చేసుకున్న ఔషధాన్ని మనం లోపలికి సేవించకూడదు. చర్మం పై లేపనంగా రాసుకోవడానికి లేదా వేడి నీటిలో వేసి ఆవిరి పట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. ఈ ఏడు పదార్థాలతో తయారు చేసిన నూనెను అర టీ స్పూన్ మోతాదులో తీసుకుని వేడి నీటిలో వేసి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఆవిరి పట్టుకోవాలి. ఇలా ఆవిరి పట్టడం వల్ల దగ్గు, జలుబు నుండి సత్వర ఉపశమనం కలుగుతుంది. అలాగే ఒక వస్త్రానికి లేదా టిష్యూ పేపర్ కు ఈ నూనెను కొద్దిగా రాసి తరచూ వాసన చూస్తూ ఉండడం వల్ల కూడా మంచి ఉపశమనం కలుగుతుంది.
ఇలా వాసన చూడడం వల్ల ముక్కు దిబ్బడ, ముక్కు కారడం తగ్గుతుంది. ఇలా తయారు చేసుకున్న నూనెను గొంతు మీద చర్మం పై రాసుకోవడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే దీనిని తలపై రాసుకోవడం వల్ల జలుబు, దగ్గు సమయంలో వచ్చే తలనొప్పి తగ్గుతుంది. దగ్గు, జలుబే కాకుండా ఈ నూనెను రాసుకుని వేడి నీటితో కాపాడం పట్టడం వల్ల కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. పై పూతగా ఈ నూనెను వాడుతూనే అల్లం ముక్కలను నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, గొంతు రాపిడి, గొంతు గరగర వంటి సమస్యలన్నీ తగ్గుతాయి. ఈ విధంగా ఎటువంటి మందులు వాడకుండా సహజ సిద్ద పదార్థాలను ఉపయోగించి మనం జలుబు, దగ్గు ల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.