Fasting : మన దేశంలో ఎన్నో మతాలకు చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. అయితే ఏ మతంలో అయినా సరే ఉపవాసం అనేది ఉంది. ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుందని.. దేవుడి ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు. అందుకనే చాలా మంది ఉపవాసం చేస్తుంటారు. వారంలో తమకు ఇష్టమైన రోజు ఉపవాసం చేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం వారంలో కనీసం ఒక రోజు వీలు కాకపోయినా నెలకు కనీసం ఒక రోజు అయినా సరే ఉపవాసం చేయాలని చెబుతున్నారు. అవును.. నెలకు కనీసం ఒక రోజు ఉపవాసం చేసినా మనం అనేక లాభాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఉపవాసం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉపవాసం చేయడం వల్ల మన శరీరంలో ఉండే గ్లూకోజ్ మొత్తం ఖర్చయిపోతుంది. దీంతో శరీరం శక్తి కోసం కొవ్వును వినియోగించుకుంటుంది. దీని వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. అలాగే రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. కనుక ఉపవాసం తప్పనిసరిగా చేయాలి. అలాగే ఉపవాసం చేయడం వల్ల షుగర్ రాకుండా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఉపవాసం చేయడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే లివర్‌లో ఉండే వ్యర్థాలు మొత్తం బయటకు పోతాయి. దీంతో లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ వ్యాధులు తగ్గుతాయి.
ఉపవాసం చేయడం వల్ల రక్తం కూడా శుద్ధి అవుతుంది. రక్తంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. అలాగే మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ఉపవాసం చేసినప్పుడు జీర్ణవ్యవస్థ మొత్తం శుభ్రమవుతుంది. దీంతో రక్తసరఫరా అక్కడ అవసరం ఉండదు. ఫలితంగా రక్తం మెదడుకు ఎక్కువగా సరఫరా అవుతుంది. దీంతో మెదడు యాక్టివ్‌గా మారుతుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. కనుక ఉపవాసం తప్పనిసరిగా చేయాలి. ఉపవాసం చేయడం వల్ల తెల్ల రక్త కణాలు చనిపోతుంటాయి. దీంతో రోగ నిరోధక వ్యవస్థ అలర్ట్ అవుతుంది. కొత్త వ్యవస్థను రూపొందించుకుంటుంది. దీంతో ఎలాంటి వ్యాధులు వచ్చినా సరే తట్టుకునేంత రోగ నిరోధక శక్తి లభిస్తుంది. దీని వల్ల వైరస్, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు రావు.
ఇక ఉపవాసం చేయడం వల్ల హార్మోన్లు సైతం నియంత్రణలో ఉంటాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అతిగా తినకుండా జాగ్రత్త పడవచ్చు. దీని వల్ల బరువు తగ్గుతారు. కనుక ఇన్ని ప్రయోజనాలను అందించే ఉపవాసంను మరిచిపోకండి. తప్పనిసరిగా వారంలో ఒక రోజు ఉపవాసం చేయండి. అది వీలుకాకపోతే కనీసం నెలకు ఒకరోజు అయినా సరే ఉపవాసం చేయండి. దీంతో అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.