Weight Loss Diet : ఈ డైట్ ప‌ద్ధ‌తిని పాటిస్తే.. 10 రోజుల్లోనే 10 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..

Weight Loss Diet : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నలో చాలా మందిని వేధిస్తున్న అతి పెద్ద స‌మ‌స్య అధిక బ‌రువు. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. వాటిల్లో వివిధ ర‌కాల డైట్ ప‌ద్ధ‌తుల‌ను పాటించ‌డం కూడా ఒక‌టి. డైట్ ప‌ద్ధ‌తుల‌ను పాటించడం వ‌ల్ల ఎంతో కొంత బ‌రువు త‌గ్గుతారు కానీ బ‌రువు త‌గ్గుతానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. అలాగే ఈ డైట్ ప‌ద్ధ‌తుల‌ను పాటించ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గిన‌న్ని పోష‌కాలు అంద‌వు. దీంతో బ‌రువు త‌గ్గ‌న‌ప్ప‌టికీ ఆరోగ్యం పాడవుతుంది. క‌నుక మ‌నం ఆరోగ్యంగా బ‌రువు తగ్గే ఆహార నియ‌మాల‌ను పాటించాలి.

అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు కింద తెలుప‌బోయే డైట్ ప‌ద్ధ‌తిని పాటించ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండడంతోపాటు చాలా త‌క్కువ స‌మయంలోనే ఎక్కువ బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డానికి ఇది ఒక చ‌క్క‌టి డైట్ ప‌ద్ధ‌తి అని చెప్ప‌వ‌చ్చు. వెంట‌నే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఈ డైట్ ప‌ద్ధ‌తి ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ డైట్ ప‌ద్ధ‌తిని పాటించాల‌నుకునే వారు ఉద‌యం పూట మొద‌ట‌గా ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ నిమ్మ‌ర‌సాన్ని లేదా ఒక టీ స్పూన్ ఆపిల్ సైడ్ వెనిగ‌ర్ ను క‌లుపుకుని తాగాలి. ఇవి రెండూ కూడా తాగ‌లేని వారు రెండు గ్లాసుల గోరు వెచ్చ‌ని నీటిని అయినా స‌రే తాగాలి. ఇలా నీళ్లు తాగిన అర‌గంట త‌రువాత నాన‌బెట్టిన 4 లేదా 5 బాదం గింజ‌ల‌ను పొట్టు తీసి తినాలి.

Weight Loss Diet follow this one you will lose weight quickly
Weight Loss Diet

త‌రువాత ఉద‌యం అల్పాహారంలో భాగంగా 2 ఉడికించిన కోడిగుడ్ల‌ను, న‌చ్చిన ఏదైనా ఒక పండును తీసుకోవాలి. మ‌నం తీసుకునే పండులో ఆపిల్ లేదా దానిమ్మ ఉండేలా చూసుకుంటే మ‌న శ‌రీరానికి ఇంకా ఎక్కువ మేలు క‌లుగుతుంది. అలాగే ఒక క‌ప్పు గ్రీన్ టీ ని కూడా తీసుకోవాలి. అదే విధంగా మ‌ధ్యాహ్నం భోజ‌న స‌మ‌యంలో భోజ‌నం చేయ‌డానికి అర గంట ముందు ఒక టీ స్పూన్ నాన‌బెట్టిన స‌బ్జా గింజ‌ల‌ను తీసుకోవాలి. ఇవి తీసుకున్న అర‌గంట త‌రువాత మూడు ఉడికించిన కోడిగుడ్ల‌ను, ఒక ఆపిల్ ను తీసుకోవాలి. త‌రువాత సాయంత్రం స్నాక్స్ స‌మ‌యంలో ఒక ఆపిల్ ను, ఒక క‌ప్పు గ్రీన్ టీ ని తీసుకోవాలి. అలాగే రాత్రి భోజ‌నాన్ని ఏడు గంట‌ల లోపు తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేయాలి. రాత్రి భోజ‌నంలో ఒక క‌ప్పు ఓట్స్ ను నీళ్ల‌ల్లో ఉడికించి లేదాఉప్మాలాగా చేసుకుని అందులో ఏదైనా న‌చ్చిన పండును క‌లుపుకుని తీసుకోవాలి.

చివ‌ర‌గా రాత్రి ప‌డుకోవ‌డ‌నాకి అర గంట ముందు ఒక క‌ప్పు గ్రీన్ టీని తాగాలి. రోజులో ఈ విధంగా ఆహారాన్ని తీసుకోవడం వ‌ల్ల మ‌నం చాలా త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఒక‌వేళ మ‌ధ్య మ‌ధ్య‌లో ఏదైనా తినాల‌నిపించినా లేదా ఆక‌లిగా ఉన్నా ఆ స‌మ‌యంలో క్యారెట్ ముక్క‌ల‌ను, కీర‌దోస ముక్క‌ల‌ను, ప‌లుచ‌టి మ‌జ్జిగ‌ను, మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తీసుకోవాలి. వీటికి మించి ఏ ఇత‌ర ప‌దార్థాల‌ను తీసుకోకూడ‌దు. ఈ ఆహార నియ‌మాల‌ను పాటిస్తూ రోజులో కనీసం 5 నుండి 8 గ్లాసుల నీటిని తాగాలి. ఇలా నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని మ‌లినాలు తొల‌గిపోతాయి.

ఈ ఆహార ప‌ద్ద‌తిని పాటించేట‌ప్పుడు జంక్ ఫుడ్ ను, నూనె, ఉప్పు ఎక్కువగా ఉప‌యోగించి చేసిన ప‌దార్థాల‌ను, తీపి ప‌దార్థాల‌ను, బ్రెడ్ ను తీసుకోకూడ‌దు. అలాగే ఈ ప‌ద్ద‌తిని పాటించే స‌మ‌యంలో మద్య‌పానం, ధూమ‌పానం వంటివి కూడా చేయ‌కూడదు. అలాగే ఈ ప‌ద్ద‌తిని పాటిస్తూ 15 నిమిషాల పాటు ఏదో ఒక వ్యాయామాన్ని కూడా చేస్తూ ఉండాలి. ఈ విధమైన ఆహార నియ‌మాల‌ను 10 రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా పాటిస్తూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల 10 రోజుల్లోనే 6 నుండి 10 కిలోల బ‌రువు వ‌ర‌కు త‌గ్గ‌వ‌చ్చు. త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ డైట్ ప‌ద్ధ‌తిని పాటిచండం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది.

D

Recent Posts