Silver Utensils : పూర్వకాలంలో మన పెద్దలు మట్టి పాత్రల్లో అన్నం తినేవారు. కానీ ఇప్పుడు చాలా మంది ప్లాస్టిక్ ప్లేట్‌లను వాడుతున్నారు. లేదా స్టీల్ ప్లేట్లను కూడా భోజనానికి వాడుతుంటారు. అయితే వాస్తవానికి మనం నీళ్లు తాగినా లేదా భోజనం చేసినా అందుకు వెండి పాత్రలు చాలా మంచివట. అలా అని ఆయుర్వేదం చెబుతోంది. వెండి పాత్రల్లో భోజనం చేయడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయట. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వం రోజుల్లో కొందరు ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్నవారు వెండిపాత్రల్లోనే తినేవారు. ఇప్పటికీ వెండి ప్లేట్లలో తినేవారు చాలా మందే ఉన్నారు. అయితే చాలా వరకు భోజనానికి ప్లాస్టిక్ లేదా స్టీల్ పాత్రలను వాడుతున్నారు. కానీ వీటికి బదులుగా వెండి పాత్రలను వాడడం మంచిది. వెండి పాత్రలను భోజనానికి వాడితే మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వెండిపాత్రల్లో భోజనం చేస్తే అవి సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి కనుక మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
వెండి మన శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. అందువల్ల వెండితో తయారు చేసిన ప్లేట్లలో భోజనం చేస్తే మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు వెండి ప్లేట్‌లలో తినడం మంచిది. దీంతో రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. వెండిపాత్రల్లో వడ్డించే అన్నం లేదా కూరల రుచి పెరుగుతుందట. దీంతో భోజనాన్ని ఇష్టంగా తింటారు. అలాగే తిన్న ఆహారం కూడా వంటికి పడుతుంది. దీంతో మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీని వల్ల పోషకాహార లోపం ఏర్పడకుండా చూసుకోవచ్చు.
ఇక వెండిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల ఈ పాత్రలను భోజనానికి వాడితే శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేసే విషయం. వెండిపాత్రల్లో భోజనం చేయడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అలాగే వెండి శరీరానికి చలువ చేస్తుంది కనుక శరీరంలో ఉన్న వేడి మొత్తం తగ్గుతుంది. వేడి శరీరం ఉన్నవారికి ఇది చాలా మంచిదని చెప్పవచ్చు. అలాగే ఈ పాత్రల్లో తింటే మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఆయుర్దాయం పెరుగుతుందని కూడా ఆయుర్వేదం చెబుతోంది. కనుక వెండి పాత్రలను ఇకపై భోజనానికి ఉపయోగించండి. అనేక లాభాలను పొందండి.