ప్రస్తుతం పాశ్చాత్య సంస్కృతి పెరిగి మోడ్రన్ లైఫ్ కి అలవాటుపడి కనీసం ఆహారంలో చేయి కూడా పెట్టకుండా స్ఫూన్ లతో తినడానికి అలవాటు పడ్డారు. కానీ మన భారతదేశంలో పూర్వ కాలం నుంచే ఆహారమంటే నేలపై కూర్చొని ఉత్తమంగా తింటే చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం ఒకసారి చూద్దాం. మనం నేలపై కూర్చొని ఆహారం తింటే శరీరంలోని రక్తనాళాలు సక్రమంగా పనిచేస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ చాలా తేలికగా జరుగుతుంది. మనం తిన్న ఆహారం వల్ల ఉత్పత్తి అయ్యే రక్తం నాళాల గుండా మన తల భాగం నుంచి కాలి భాగం వరకు సులభంగా ప్రసరిస్తుంది.
ప్రస్తుతం కాలంలో ఒకే కుటుంబంలో ఉన్న వారు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు ఎవరు ఎప్పుడు తింటారో కూడా అర్థం కావడం లేదు. దీనివల్ల కనీసం కుటుంబంలో జరిగే విషయాలు కూడా కలిసి చర్చించే సమయం కూడా ఎవరికీ ఉండడం లేదు. కానీ నేలపై కూర్చుని తింటే కుటుంబం అంతా ఒకేసారి తింటారు. దీంతో వారి మధ్య ఉన్న ఐక్యత పెరుగుతుంది. వారికి ఆహారం విలువ కూడా తెలుస్తుంది. మనం నేలపై కూర్చుని తిన్నప్పుడు మన శరీరం నిటారుగా ఉండటం వల్ల తిన్న ఆహారం నేరుగా జీర్ణాశయంలోకి వెళ్లి శరీరంలోని వివిధ భాగాలకు చేరుకుంటుంది. దీనివల్ల మీరు అతిగా తినకుండా, కావాల్సినంత తింటారు. కాబట్టి ఊబకాయం అనేది దరిచేరదు.
కింద కూర్చుని తిన్నప్పుడు మనం వంగి ఆహారం తీసుకొని మళ్లీ ఆపై నిటారుగా ఉన్నటువంటి భంగిమలో రావాలి. ఇలా చేయడం వల్ల ఆహారం నేరుగా జీర్ణ వ్యవస్థ కు చేరుతుంది. దీంతో సులభంగా జీర్ణమై అజీర్ణం, కడుపునొప్పి వంటి సమస్యలు దూరమవుతాయి. నేల పైన కూర్చొని ఆహారం తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడడమే కాకుండా, గ్యాస్ ట్రబుల్ ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి. అలాగే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.