Fish : మధుమేహం.. ఏటా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి టైప్-1, మరొకటి టైప్-2. క్లోమ గ్రంథి అస్సలు పనిచేయకపోతే టైప్-1, పనిచేస్తున్నా దాన్నుంచి విడుదలయ్యే ఇన్సులిన్ ను శరీరం సరిగ్గా తీసుకోకపోతే అప్పుడు టైప్-2 మధుమేహం వస్తాయి. అయితే ఏది వచ్చినా ఆయా వ్యక్తుల శరీరాల్లో గ్లూకోజ్ ఎప్పుడూ రక్తంలో ఉండాల్సిన పరిమాణం కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో ఈ వ్యాధి శరీరంలో అనేక అవయవాలను పనిచేయకుండా చేస్తుంది. అలాగని మధుమేహం మందులకు లొంగేది కాదు. నియంత్రణతోనే దీన్ని లొంగదీయవచ్చు.
అయితే ఎన్నో రకాల డయాబెటిక్ మందులు ఆయా వైద్య విధానాల్లో మనకు అందుబాటులో ఉన్నా వారానికి రెండు సార్లు చేపలను తింటే డయాబెటిస్ సమస్యకు చెక్ పెట్టవచ్చట. అవును, మీరు విన్నది నిజమే. వారానికి రెండు సార్లు చేపలను తింటే దాంతో డయాబెటిస్ నయమవుతుందని పలువురు సైంటిస్టులు ఈ మధ్యే కనుగొన్నారు. లండన్ కు చెందిన ఓ పరిశోధక బృందం తాజాగా చేసిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. వారు ఏం చేశారంటే 55 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సున్న 3614 మంది టైప్-2 డయాబెటిస్ రోగులకు వారానికి 500 మిల్లీగ్రాముల ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లను ఆహారంలో భాగంగా ఇచ్చారు.
నిజానికి ఈ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు అనేవి మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు. ఇవి చేపల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే అలా వారికి కొన్ని వారాల పాటు సదరు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లను ఇవ్వగా అనంతరం తెలిసిందేమిటంటే ఆ రోగుల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 48 శాతం వరకు తగ్గాయట. అంతేకాదు, డయాబెటిస్ వల్ల వచ్చే కంటి, మూత్ర పిండ సమస్యలు దాదాపుగా చాలా వరకు తగ్గాయని సదరు పరిశోధకులు చెబుతున్నారు.
ఈ క్రమంలో లండన్ సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే వారానికి కనీసం రెండు సార్లయినా చేపలను తింటే దాంతో మన శరీరానికి పైన చెప్పినట్టుగా ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి. దీంతో షుగర్ అదుపులోకి వస్తుంది. చూశారుగా, చేపలను తినడం వల్ల ఎంతటి అద్భుతమైన ఉపయోగం తెలిసిందో. కనుక చేపలను మన ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. దాంతో షుగర్ మాత్రమే కాదు, ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కనుక చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.