హెల్త్ టిప్స్

వివాహం ఏ వయసులో చేసుకుంటే మంచిది..డా:సమరం ఏమంటున్నారంటే..?

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. పెళ్లికి ముందు ఏ విధంగా జీవించినా కానీ వివాహం తర్వాత మాత్రం ప్రతి ఒక్కరి జీవితం మారిపోతుంది. తమ పిల్లలు ఎదుగుతున్నారు అంటే తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ఆలోచిస్తారు. ఇందులో అమ్మాయిలకు అయితే ఇంకా తొందర పడతారు తల్లిదండ్రులు. అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. 20 సంవత్సరాలు దాటాయి అంటే చాలు భారతదేశంలో మూడు ముళ్ళు పడాల్సిందే. ఈ విషయంలో అబ్బాయిలకు కాస్త రిలీఫ్ ఉంటుంది. అబ్బాయిలని 28 ఏళ్ల వరకు పెళ్లి గురించి ఎక్కువ ఆలోచించరు. ఎందుకంటే వారు చదువు కంప్లీట్ చేసుకొని సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని జాబు సంపాదిస్తారు.

ఇక జాబ్ వచ్చిన తర్వాత అబ్బాయిల పెళ్లి ప్రస్తావన మొదలవుతుంది. అసలు వివాహానికి ఒక ఏజ్ అంటూ ఉంటుందా. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎవరిని పెళ్లి చేసుకోవాలి. ఏ సమయంలో పెళ్ళికి రెడీ కావాలి. దీనిపై కొన్ని అపోహలను నివృత్తి చేశారు డాక్టర్ సమరం. ప్రస్తుత కాలంలో వివాహాల కంటే ఎక్కువ విడాకులు జరుగుతున్నాయి. దీనికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఏ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే ఇలాంటి వాటి బయట పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 28 నుంచి 30 సంవత్సరాల మధ్యలో పెళ్లి చేసుకుంటే, ఇలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు.

what is the best age for marriage what dr samaram says

వయసు ఒక కొలమానం అయినప్పటికీ మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే వారిని పెళ్లి చేసుకుంటే, లైఫ్ పర్ఫెక్ట్ గా ఉంటుందని సమరం అంటున్నారు. పెళ్లి అనగానే మంచి ముహూర్తం కావాలి బట్టలు, బంధువులు స్నేహితులు వాటీ గురించి మాత్రమే ఆలోచన చేస్తారు. కానీ పెళ్ళి చేసుకోవడానికి ఇది కరెక్ట్ వయసేనా అని ఆలోచించేవారు చాలా తక్కువమంది. 20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. వారికి భవిష్యత్తు పైన అవగాహన ఉండదని సమరం చెప్పుకొచ్చారు. అలాగే 30 సంవత్సరాలు లోపు పెళ్లి చేసుకుంటే, ఆలోచన శక్తి ఉంటుందని జీవితం అంటే ఏంటో అర్థం అవుతుందని తెలియజేసారు.

Admin

Recent Posts