White Lines On Nails : మన శరీరానికి శక్తి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనే మూడు స్థూల పోషకాల ద్వారా లభిస్తుంది. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ లోపించినప్పటికి మన శరీరానికి ఎటువంటి హాని కలగదు. కానీ ప్రోటీన్స్ లోపిస్తే మాత్రం మన శరీరానికి హాని కలుగుతుంది. మన దేశంలో చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి. ప్రోటీన్స్ లోపించడం వల్ల మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ప్రోటీన్స్ లోపించడం వల్ల మనలో కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోటీన్ లోపించడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కొత్త వెంట్రుకలు తిరిగి రావు. జుట్టు పెరుగుదల కూడా ఆగిపోతుంది.
అలాగే చర్మం పొడిబారడంతో పాటు పొట్టు కూడా రాలినట్టుగా ఉంటుంది. చర్మం ఎక్కువగా ముడతలు పడుతుంది. చర్మం ముడతలు పడి చిన్న వయసులోనే పెద్ద వారిలాగా కనబడతారు. అలాగే గోర్లపైన గరుకుగా ఉంటుంది. గోర్లపైన నిలువుగా గీతలు ఏర్పడతాయి. అలాగే ఎప్పుడూ కూడా నీరసంగా ఉంటారు. చిన్న పని చేసినప్పటికి ఎక్కువగా నీరసించి పోతుంటారు. అలాగే కండపుష్టి తగ్గి కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రోటీన్ లోపించడం వల్ల గాయాలు, దెబ్బలు, పుండ్లు నెమ్మదిగా మానుతాయి. అదే విధంగా శరీరం డికాట్సిఫికేషన్ కూడా నెమ్మదిస్తుంది. శరీరం తనని తాను శుభ్రం చేసుకోవాలంటే ఎన్నో రకాల హార్మోన్లు, ఎంజైమ్, ఎమైనో యాసిడ్లు లు అవసరమవుతాయి.
ఇవి అన్ని కూడా ప్రోటీన్ ఉంటేనే తయరవుతాయి. కనుక వీటి ఉత్పత్తి శరీరం డిటాక్సిఫికేషన్ తగ్గుతుంది. అలాగే ప్రోటీన్ లోపించడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతుంది. ఆకలి ఎక్కువగా వేస్తుంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. దీర్ఘకాలికంగా ప్రోటీన్ లోపించడం వల్ల పిల్లల్లో ఎదుగుదల తగ్గుతుంది. హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఎముకలు గుల్లబారిపోతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ విదంగా శరీరంలో ప్రోటీన్ లోపించడం వల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా మనం ఈ లోపాన్ని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
100 గ్రాముల సోయా టోఫులో 52 గ్రాములు, మీల్ మేకర్ లో 48 గ్రాములు, సోయా చిక్కుడు గింజల్లో 45 గ్రాములు, పుచ్చగింజల్లో 34 గ్రాములు, చియా విత్తనాలు 32 గ్రాముల ఉంటుంది. అలాగే పల్లీల్లో 25 గ్రాములు, పిస్తా పప్పులో 23 గ్రాములు, పొద్దు తిరుగుడు గింజల్లో 23 గ్రాములు, నువ్వుల్లో 23 గ్రాములు, బాదం పప్పులో 23 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చికెన్ లో 238 గ్రాములు, మటన్ లో 21 గ్రాముల, చేపల్లో 10 నుండి 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ ఆహారాలను పిల్లలతో పాటు పెద్దలు తీసుకోవడం వల్ల ప్రోటీన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. ఈ ఆహారాలను పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.