Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

రాత్రి పూట దిండు కింద వెల్లుల్లిని పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Admin by Admin
April 12, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇక నిద్రపోదాం అనేసుకుంటే నిద్ర రాదు. నిద్రని ఆహ్వానించాలి, అంటే నెమ్మదిగా మనం నిద్రకి సిద్ధమవ్వాలి. మీరు నిద్రపోవాలనుకున్న సమయానికి గంట ముందు నుండీ మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. మర్నాటికి బట్టలు రెడీ చేసుకోవడం, బ్రష్ చేసుకోవడం, ప్రేయర్ చేసుకోవడం వంటి పనులు మిమ్మల్ని నిద్రకి సిద్ధం చేస్తాయి. మరీ ముఖ్యంగా ఈ గంట మొదలయ్యేప్పుడే మీరు మీ ఫోన్ పక్కన పెట్టేయాలి. ఆదివారం, సోమవారంతో సంబంధం లేకుండా రోజూ ఒకే సమయానికి లేచే అలవాటు ఎంతో మేలు చేస్తుంది. ఇది అలవాటు అయిపోతే అసలు అలారమే అక్కరలేదు. ఇది అలవాటు అవ్వడానికి మాత్రం అలారం హెల్ప్ కావాలి. నిద్ర లేచేందుకు మాత్రమే కాదు, నిద్ర పోయేందుకు కూడా. మీరు ఏ టైమ్ నుండి నిద్ర కోసం ప్రిపరేషన్స్ మొదలు పెట్టబోతున్నారో ఆ టైమ్ కి అలారం పెట్టుకుంటే మర్చిపోకుండా ఉంటారు.

పొద్దున్న నిద్ర లేవగానే కర్టెన్స్ ఓపెన్ చేసేసి, ఇంట్లో నుండి బయటకి వచ్చి వెలుతురుని మీ ఇంట్లోకి ఆహ్వానించండి. వెలుతురు అంటే మెళ‌కువ అన్న విషయం మీ మెదడుకి అర్ధమవుతుంది. అలాగే, రాత్రి నిద్రకి ముందు నెమ్మదిగా ఇంట్లో లైట్స్ అన్నీ డిమ్ చేసుకుంటూ రండి. చీకటి గా ఉందంటే నిద్ర పోవాలి అన్న విషయం మీ మెదడు అర్ధం చేసుకుంటుంది. చివరగా అన్ని లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోండి. రాత్రి బాత్రూమ్ కి వెళ్ళడానికి మీకు లైట్ అవసరం అనుకుంటే ఒక చిన్న బ్యాటరీ లైట్ మీ దగ్గర పెట్టుకోండి. మీ బెడ్ ని చక్కని నిద్రకి అనువుగా తయారు చేసుకోండి. చల్లగా ఉండే బెడ్రూమ్ లో మెత్తని బెడ్ షీట్స్, మీకు సౌకర్యంగా ఉండే దిండు, బెడ్రూమ్ గోడలకి తేలికపాటి రంగులు, కుదిరితే నైట్‌స్టాండ్ మీద తాజా పూలు.. వంటివి మీరు బెడ్రూమ్ లోకి అడుగు పెట్టగానే ఆవలింతలు వచ్చేలా చేస్తాయి.

put garlic under pillow see this happens

బెడ్రూమ్ లో టీవీ చూడడం, చదువుకోవడం వంటి పనులు చేయకండి. బెడ్రూం మీరు నిద్ర పోవడానికీ, రొమాన్స్ ఎంజాయ్ చేయడానికీ మాత్రమే అని గుర్తు పెట్టుకోండి. నైట్ స్టాండ్ మీద ఫోన్ పెట్టుకునే అలవాటుకి కూడా స్వస్తి చెప్పండి. అలాగే, మీ ఆఫీసు వర్క్ కి కూడా బెడ్రూమ్ లోకి ప్రవేశం లేదు. రాత్రి పూట అందరం కొద్దిగా ఎక్కువే తింటాం. కబుర్లు చెప్పుకుంటూ పొద్దున విశేషాలు పంచుకుంటూ డిన్నర్ చేస్తారు చాలా మంది. ఇలా చేసినప్పుడు ఒక ముద్ద ఎక్కువే తింటాం, తప్పు లేదు. కానీ ఆ తరువాత మాత్రం ఇంకేం తినకూడదు. అలాగే, డిన్నర్ కీ నిద్రకీ మధ్య కనీసం రెండు గంటల సమయం ఉండాలి. అప్పుడే మీరు నిద్రపోయే సమయానికి పొట్టలో తేలికగా ఉండి హాయిగా నిద్రపడుతుంది. కాఫీ తాగి కప్పు పక్కన పెట్టి గుర్రు పెట్టి నిద్రపోయే వారి సంఖ్య చాలా తక్కువ, అలాంటి అదృష్టవంతుల్ని పక్కన పెట్టేద్దాం. మామూలు వాళ్ళందరికీ కాఫీ తాగిన వెంటనే నిద్ర పట్టడం కష్టం. కాబట్టి మధ్యాహ్నం తరువాత కెఫీన్ కి దూరంగా ఉండడం అవసరం.

కెఫీన్ అంటే కాఫీనే గుర్తొస్తుంది కానీ కొన్ని రకాల టీలు, సోడాలు, చాకొలేట్స్ లో కూడా కెఫీన్ ఉంటుంది. చెక్ చేసుకుని తాగడం అలవాటు చేసుకోండి. అలాగే, నిద్ర సమయానికి దగ్గర‌ ఆల్కహాల్ కూడా తీసుకోకండి. ఆల్కహాల్ తీసుకున్న తరువాత నిద్ర పడుతుంది కానీ మధ్యలో మెలకువ వచ్చేస్తుంది, కాబట్టి ఈ అలవాటుని కూడా మార్చుకోండి. రాత్రి పూట ఒక డ్రింక్ మీకు కంపల్సరీ అయితే డిన్నర్ తో పాటు తీసుకోండి, మీరు నిద్రపోయే సమయానికి దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఒక్క సారి ఇల్లంతా చూసి మీ ఇంట్లో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయో లెక్క పెట్టండి.. టీవీలు, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్.. వీటన్నింటికీ నిద్రకి గంట ముందు గుడ్ నైట్ చెప్పేయండి. ఆ తరువాత మీరు నిద్రకి సంబంధించిన ప్రిపరేషన్స్ మొదలు పెట్టండి. అలారం కూడా విడిగా కొనుక్కోండి, ఫోన్ లో అలారం పెట్టుకునే పద్ధతి వదిలేయండి.

పాదాలు చల్లగా అయిపోయి కొంత మందికి నిద్ర పట్టదు. అలాంటి వారు పడుకునే ముందు సాక్స్ వేసుకుని పడుకుంటే పాదాలు వెచ్చగా ఉంటాయి. సాక్స్ వేసుకోవడం ఇష్టం లేకపోతే పాదాల వరకూ దుప్పటి కప్పుకోండి. మీకు నిద్ర పట్టడం లేదనుకోండి. నిద్రకి సంబంధించిన పదాలన్నీ గుర్తు తెచ్చుకోండి. హాయి, ప్రశాంతత, గాఢ నిద్ర, కలలు, విశ్రాంతి వంటి పదాలు గుర్తు తెచ్చుకోండి, వెంటనే నిద్ర పట్టేస్తుంది. మీకు లెక్కలు అంటే ఇష్టమైతే మీరు ఇలా కూడా చేయవచ్చు, మూడు వందల నుండి వెనక్కి లెక్క పెట్టుకుంటూ రండి. ఇది ఎంత బోరింగ్ గా ఉంటుందంటే క్షణాల్లో నిద్ర పట్టేస్తుంది. ఇది వినటానికి విచిత్రంగా ఉంటుంది కానీ దిండు కింద రెండు వెల్లుల్లి రెమ్మలు పెట్టుకుని పడుకుంటే చాలా గాఢంగా నిద్ర పడుతుందట. వెల్లుల్లి లో ఉండే ఒక రకమైన రసాయనం దీనికి కారణమట. వెల్లుల్లి పొట్టుతో సహా దిండు కింద పెట్టుకుని చూడండి, ఎంత చక్కగా నిద్రపోతారో.

వీటన్నింటితో పాటూ చక్కని రొమాన్స్, మ్యూజిక్, పార్ట్నర్ తో ఉండే చిన్న చిన్న ఘర్షణలని బెడ్రూమ్ బయటే వదిలేయడం, డిన్నర్ తరువాత ఏదైనా పుస్తకం చదివే అలవాటు చేసుకోవడం (సస్పెన్స్, థ్రిల్లర్ కాదు సుమా) వంటివి చిన్న చిన్నవే కానీ నిద్ర యొక్క క్వాలిటీని పెంచుతాయి.

Tags: garlic under pillow
Previous Post

మీకు జీవితంలో ఆనందం ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే..

Next Post

స్ట్రాబెర్రీల‌ను తింటే ఎన్నో లాభాలు.. త‌ప్ప‌కుండా తినండి..

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!