కాకరకాయలను తరచూ తినడం వల్ల మనకు ఎన్ని రకాల లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. జీర్ణ సమస్యలు ఉండవు. అందుకనే వైద్యులు కాకరకాయలను తినాలని డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు సూచిస్తుంటారు. అయితే కాకరకాయను ఎవరైనా తినవచ్చు కానీ.. వీరు మాత్రం అస్సలు తినకూడదు.. ఎందుకో కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
* గర్భంతో ఉన్న మహిళలు కాకరకాయలను తినరాదు. వీటిల్లో ఉండే మెమొకరిన్ అనబడే సమ్మేళనం అబార్షన్‌కు కారణమవుతుంది. అందువల్ల గర్భిణీలు కాకరకాయలను తినరాదు.
* సంతానం కోసం ఫెర్టిలిటీ సెంటర్లకు వెళ్లేవారు, వారు ఇచ్చే మందులను వాడే దంపతులు కాకరకాయలను తినకూడదు. తింటే ఆ మందులు సరిగ్గా పనిచేయవు.
* లివర్ సమస్యలు ఉన్నవారు కాకరకాయలను తింటే లివర్‌లో ఇన్‌ఫెక్షన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక అలాంటి సమస్యలు ఉన్నవారు కాకరకాయలను తినకపోవడమే మంచిది.
* మహిళలు రుతుస్రావం సమయంలో కాకరకాయలను తినరాదు. తింటే రక్తస్రావం అధికం అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
* సర్జరీలు చేయించుకున్న వారు 2 వారాల వరకు కాకరకాయలను తినరాదు.
* శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ఎప్పుడూ తక్కువగా ఉండేవారు (హైపోగ్లైసీమియా) కాకరకాయలను తినరాదు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365