వేడి వేడిగా టీ లేదా కాఫీ తాగితే వచ్చే మజాయే వేరు కదా. చాలా మంది టీ ని ఇష్టంగా తాగుతారు. కొందరు కాఫీ అంటే ఇష్ట పడతారు. అయితే టీ లేదా కాఫీ.. ఏది తాగినా సరే.. కొందరు గ్లాస్ నీటిని తాగుతారు. అలా ఎందుకు చేస్తారు ? దాంతో ఏమవుతుంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టీ పీహెచ్ విలువ 6. కాఫీ పీహెచ్ విలువ 5గా ఉంటుంది. నీరు 7 పీహెచ్ విలువను కలిగి ఉంటుంది. అయితే టీ, కాఫీలు ఆమ్ల (యాసిడ్) స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల వాటిని తాగినప్పుడు జీర్ణాశయం గోడలపై యాసిడ్ ప్రభావం చూపిస్తుంది. ఇది జీర్ణాశయంపై నష్టం కలిగిస్తుంది. కానీ టీ కాఫీ తాగే ముందు నీరు తాగడం వల్ల జీర్ణాశయంలోకి కాఫీ, టీ చేరినా ఆమ్ల స్వభావం ఉండదు. పీహెచ్ స్థాయిలు తటస్థంగా ఉంటాయి. దీంతో జీర్ణాశయంపై ఆమ్ల ప్రభావం పడదు. జీర్ణాశయం ఆమ్లాల నుంచి సురక్షితంగా ఉంటుంది. కనుకనే టీ, కాఫీలు తాగే ముందు నీటిని తాగుతారు.
టీ, కాఫీ మాత్రమే కాదు, అధిక పీహెచ్ విలువ కలిగిన పదార్థాలు వేటిని తీసుకున్నా ముందు నీరు తాగకపోతే గుండెల్లో మంట, జీర్ణాశయ గోడలు దెబ్బ తినడం, పెద్ద పేగు క్యాన్సర్ వంటివి వస్తాయి. కనుక యాసిడ్ స్వభావాన్ని కలిగి ఉండే పదార్థాలను తీసుకునే ముందు కచ్చితంగా ఒక గ్లాస్ నీటిని తాగాలి. దీంతో జీర్ణాశయంలో పీహెచ్ స్థాయిలు తటస్థంగా ఉండి ఆమ్ల స్వభావం తగ్గుతుంది. జీర్ణాశయం సురక్షితంగా ఉంటుంది.