గుండెకు హాని కలిగించే చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్ డిఎల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ లేదా హెచ్ డిఎల్ పెరగాలంటే తరచుగా బరువు సరి చూసుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాలు తినటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటివి ఆచరించాలి. అయితే, గుండె సంబంధిత సమస్యలు తగ్గాలన్నా లేక మీ రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడకుండా వుండాలన్నా మన జీవన విధానంలో కొన్ని మార్పులను కూడా చేయాలి. ప్రధానంగా పొగత్రాగడం మానివేయాలి.
ఎప్పటికపుడు రక్తపోటు సరిచూసుకుంటూ అది సాధారణంగా వుండేలా మందులు లేదా ఇతర జీవన విధానం పాటించాలి. అదే రకంగా డయాబెటీస్ వున్న వారైతే దానిని నియంత్రించాలి. అధిక బరువు వున్న వారికి అధిక కొల్లెస్టరాల్, రక్తపోటు, డయాబెటీస్, గుండె జబ్బులు వుండే అవకాశం వుంది. వీరు ఎప్పటికపుడు తమ బాడీ మాస్ ఇండెక్స్ పరీక్షించుకుంటూ సరైన వైద్య విధానాలు ఆచరించాలి.
మీరు తినే ఆహారంనుండి సుమారు 20 శాతం లేక అంతకంటే అధికంగా కొల్లెస్టరాల్ శరీరానికి చేరుతుంది. అయితే ఈ ఆహారంనుండి మీయొక్క లివర్ 80 శాతం వరకు మరింత కొల్లెస్టరాల్ తయారు చేస్తుంది. కనుక పైన చెప్పిన జాగ్రత్తలన్నీ మీరు ఆచరించడం ప్రధానం. అంతే కాక ఇప్పటికే వైద్య సలహా పొంది వున్న వారైతే, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించటం కూడా చేయాలి. అపుడే మీరు మీ కొల్లెస్టరాల్ సమస్యను నూటికి నూరు శాతం పరిష్కరించుకొనే అవకాశం వుంటుంది.