Dates : ఉద‌యం ప‌ర‌గ‌డుపునే ఖ‌ర్జూరాల‌ను తింటే క‌లిగే అద్భుతమైన లాభాలివే..!

you should eat Dates on empty stomach for these benefits

Dates : ఖ‌ర్జూరాలు మ‌న‌కు ఎంతో శ‌క్తిని అందిస్తాయి. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవ‌చ్చు. వీటిల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అయితే ఖ‌ర్జూరాలు తియ్య‌గా ఉన్న‌ప్ప‌టికీ వీటిని ఎక్కువ‌గా తిన‌లేం. అందువ‌ల్ల వీటిని తింటే బ‌రువు పెరుగుతామ‌న్న భ‌యం చెందాల్సిన అవ‌స‌రం లేదు. ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మ‌న‌ల్ని వ్యాధుల నుంచి ర‌క్షిస్తాయి. మెద‌డును ఉత్తేజంగా ఉంచుతాయి.

ఖ‌ర్జూరాల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల వీటిని రోజూ తింటే జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అయితే ఖ‌ర్జూరాల‌ను ఎప్పుడు తినాల‌నే విష‌యంలో చాలా మంది సందేహాలు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే వాటికి స‌మాధానాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఖ‌ర్జూరాల‌ను తిన‌వ‌చ్చు. దీంతో ఉద‌యం శ‌రీరానికి వేగంగా శ‌క్తి ల‌భిస్తుంది. ఇది మ‌న‌ల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది. బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. రోజంతా ఉత్సాహంగా ప‌నిచేస్తారు. మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేస్తుంది. చురుగ్గా ఉంటారు.

ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఖ‌ర్జూరాలు 2-4 తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భించి వ్యాయామం చురుగ్గా చేయ‌వ‌చ్చు. దీంతో అల‌స‌ట, నీర‌సం రాకుండా చూసుకోవ‌చ్చు. ఎక్కువ సేపు వ్యాయామం చేయ‌వ‌చ్చు. దీంతో బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు.

ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. అయితే ఇందుకుగాను ముందు రోజు రాత్రి 2-4 ఖ‌ర్జూరాల‌ను నీటిలో నాన‌బెట్టాలి. వాటిని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తినాలి. దీనివ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌తారు.

శ‌రీరంలో వాపులు, నొప్పులు ఉన్న‌వారు ఉద‌యం ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

అయితే విరేచ‌నాలు, వాంతులు అవుతున్న వారు ఖ‌ర్జూరాల‌ను తిన‌రాదు. ఆ స‌మ‌స్య‌లు త‌గ్గాక వాటిని య‌థావిధిగా తిన‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts