పూర్వం కేవలం పెద్ద వాళ్లకు మాత్రమే బీపీలు, షుగర్లు వచ్చేవి. వయస్సు మీద పడుతున్న వారికి మాత్రమే ఆ వ్యాధులు వచ్చేవి. దీంతో వారు పెద్దగా ఇబ్బందులు పడేవాళ్లు కాదు. కంట్రోల్‌లోనే ఉండేవారు. అయితే ఈ వ్యాధులు ఇప్పుడు చిన్న వయస్సులోనే వస్తున్నాయి. దీంతో అలాంటి వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు.
చిన్న వయస్సులోనే బీపీ, షుగర్ బారిన పడుతుండడంతో వాటిని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. మారిన జీవనశైలి, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, గంటల తరబడి కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేయడం.. వంటి అంశాల కారణంగా బీపీ, షుగర్ మరింత పెరిగి చివరకు హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల బీపీ, షుగర్ లను తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గుప్పెడు మెంతుల్ని రాత్రి నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు పరగడుపునే వాటిని నమిలి తినాలి. దీని వల్ల బీపీ పూర్తి స్థాయిలో కంట్రోల్ లో ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది.
2. రోజూ రెండు టీస్పూన్ల మెంతి పొడిని నీటితో గానీ, పాలతో గానీ తీసుకోవడంవల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. ఉదయం పరగడుపునే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది.
3. మెంతులు లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. వాటిని ఎలా తీసుకోవాలంటే.. రెండు చెంచాల మెంతి గింజలను సుమారుగా 4 గంటల పాటు నీటిలో నానబెట్టి వాటిని ఆ నీటితో సహా ఉడకించి వడగట్టి తేనెతో తీసుకోవాలి. దీంతో ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. లివర్ చెడిపోయి ఉంటే బాగు పడుతుంది. లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందులో ఉండే వ్యర్థాలు బయటకు పోయి లివర్ శుభ్రంగా మారుతుంది.
4. నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు అవుతున్నవారు, మూలశంక (పైల్స్) ఉన్నవారు.. వేయించిన మెంతుల పొడిని 1-2 చెంచాలు తీసుకుని దాన్ని మజ్జిగలో కలిపి తాగాలి. ఉదయం, సాయంత్రం ఈ విధంగా చేయాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
5. మెంతుల పొడిని తలకు పట్టించి స్నానం చేస్తే చుండ్రు, వెండ్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతుల పిండి మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. దీనివల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.
మెంతులతో చాలా ఉపయోగాలున్నాయి కాబట్టే మెంతులకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. ఈ క్రమంలోనే మెంతులతో బీపీ, షుగర్‌ను తగ్గించుకోవచ్చు. అయితే రోజూ వ్యాయామం చేస్తూ సరైన జీవనశైలిని పాటిస్తే ఇంకా మెరుగైన ఫలితాలను సాధించవచ్చు.