ఆరోగ్యం

మ‌న శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) ఎక్కువ‌గా ఉండాలి.. ఈ ఆహారాల‌ను తింటే HDLను పెంచుకోవ‌చ్చు..!

మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. రెండోది మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. అయితే మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాలు, పాటించే అల‌వాట్ల వ‌ల్ల శ‌రీరంలో ఎల్‌డీఎల్ పేరుకుపోతుంది. దాన్ని త‌గ్గించేందుకు హెచ్‌డీఎల్ అవ‌స‌రం అవుతుంది. ఎల్‌డీఎల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అందువల్ల ఎల్‌డీఎల్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకోవాలి. అందుకుగాను హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాల్సి ఉంటుంది.

take these foods to increase good cholesterol (HDL) levels

మ‌న శ‌రీరంలో హెచ్‌డీఎల్ లెవ‌ల్స్ 60 mg/dL వ‌ర‌కు ఉండాలి. 40 mg/dL క‌న్నా త‌క్కువ‌గా ఉంటే ఆ స్థాయిల‌ను పెంచుకోవాల‌ని అర్థం. లేదంటే ఎల్‌డీఎల్ పెరుగుతుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే కింద తెలిపిన ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) లెవ‌ల్స్ ను పెంచుకోవ‌చ్చు. దీంతో ఎల్‌డీఎల్ త‌గ్గుతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే..

1. బీన్స్‌, ప‌ప్పు దినుసులు, శ‌న‌గ‌లు, పెస‌లు, సోయాబీన్స్ ల‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హెచ్‌డీఎల్‌ను పెంచుతాయి. అందువ‌ల్ల ఈ ఆహారాల‌ను రోజూ తీసుకుంటే మంచిది. వీటిల్లో ఉండే ఫోలేట్, మెగ్నిషియం, పొటాషియం గుండె జ‌బ్బులు రాకుండా ర‌క్షిస్తాయి. ఎల్‌డీఎల్‌ను త‌గ్గిస్తాయి. హెచ్‌డీఎల్‌ను పెంచుతాయి.

2. వాల్ న‌ట్స్, బాదంప‌ప్పు, జీడిప‌ప్పులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే మెగ్నిషియం, ఐర‌న్‌, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శ‌క్తి స్థాయిల‌ను పెంచుతాయి. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గిస్తాయి. అవిసె గింజ‌లు, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, చియా సీడ్స్‌లోనూ త‌గిన మోతాదులో మెగ్నిషియం ఉంటుంది. అలాగే ఫైబ‌ర్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి గుండెను సంర‌క్షిస్తాయి. హెచ్‌డీఎల్ లెవ‌ల్స్ ను పెంచుతాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్ ను నాశ‌నం చేస్తాయి.

3. అవ‌కాడోల‌ను తిన‌డం వ‌ల్ల వాపుల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి. వీటిని తింటుంటే హెచ్‌డీఎల్ లెవ‌ల్స్ పెరుగుతాయి. వీటిల్లో మెగ్నిషియం, పొటాషియం, విట‌మిన్ బి, కె, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. ఇవి ఎల్‌డీఎల్‌ను త‌గ్గిస్తాయి. హెచ్‌డీఎల్ లెవ‌ల్స్‌ను పెంచుతాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.

Share
Admin

Recent Posts