వేసవిలో తినాల్సిన పండ్లలో తర్బూజా పండ్లు కూడా ఒకటి. ఇవి శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే ఈ పండ్లు చప్పగా ఉంటాయి. అందువల్ల దీన్ని చాలా మంది జ్యూస్ రూపంలో తీసుకుంటారు. కానీ జ్యూస్ లో చక్కెర కన్నా తేనె కలిపి తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. తర్బూజా పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తర్బూజా పండ్లలో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అవన్నీ మన శరీరానికి ఎంతగానో అవసరం అవుతాయి. ఈ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అధిక మొత్తాల్లో విటమిన్ ఎ కూడా వీటిలో మనకు లభిస్తుంది. ఇది కంటి చూపు, చర్మ కణాల మరమ్మత్తులు, కణాల పెరుగుదలకు అవసరం అవుతుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి కణాలు దెబ్బ తినకుండా చూస్తాయి. గాలిక్ యాసిడ్, ఎల్లాజిక్ యాసిడ్, కెఫియిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు తర్బూజా పండ్లలో ఉంటాయి.
2. ఒక కప్పు.. అంటే సుమారుగా 156 గ్రాముల తర్బూజా పండులో ఫైబర్ 2 గ్రాములు, ప్రోటీన్లు 1 గ్రాము, విటమిన్ సి 64 శాతం (రోజులో కావల్సిన దాంట్లో), విటమిన్ ఎ 29 శాతం, పొటాషియం 9 శాతం, ఫోలేట్ 8 శాతం, నియాసిన్ 7 శాతం, విటమిన్ బి6 7 శాతం, మెగ్నిషియం 5 శాతం, థయామిన్ 5 శాతం, విటమిన్ కె 3 శాతం ఉంటాయి. ఇవన్నీ మనకు పోషకాలను అందిస్తాయి.
3. రోజూ కప్పు మోతాదులో తర్బూజా పండ్లను తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాలు వృద్ధి చెందుతాయి. దీంతో మన శరీరం ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
4. అధిక బరువు తగ్గాలనుకునేవారికి తర్బూజా పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో 90 శాతం నీరే ఉంటుంది. అందువల్ల వీటిని తింటే క్యాలరీలు చాలా తక్కువగా లభిస్తాయి. బరువు తగ్గేందుకు ఇది సహాయ పడుతుంది. 3628 మందికి చెందిన ఆహారపు అలవాట్లను పరిశీలించిన సైంటిస్టులు తర్బూజా పండ్లను తరచూ తినే వారు అధిక బరువు తగ్గుతారని వెల్లడించారు. అందువల్ల వీటిని రోజూ తింటే అధిక బరువు తగ్గవచ్చు.
5. శరీరంలో వాపులు రావడం వల్ల అనేక అనారోగ్యాలు వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ తర్బూజా పండ్లను తినడం వల్ల ఈ రిస్క్ తగ్గుతుంది. తర్బూజా పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. అలాగే వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలు దెబ్బ తినకుండా చూస్తాయి. దీంతో క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
6. తర్బూజా పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీరం చల్లగా ఉంటుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. బాగా అలసిపోయి వచ్చిన వారు ఈ పండ్లను తీసుకుంటే శక్తి వస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. ఈ పండ్లు తాజాదనపు అనుభూతిని అందిస్తాయి.
తర్బూజా పండ్లను నేరుగా తినవచ్చు. అలా తినలేం అనుకునే వారు జ్యూస్ చేసుకుంటే అందులో చక్కెరకు బదులుగా తేనెను కలుపుకోవడం ఉత్తమం. లేదంటే క్యాలరీలు అధికంగా వస్తాయి. అప్పుడు ఆ జ్యూస్‌ను తాగి కూడా ప్రయోజనం ఉండదు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365