Belly Fat Drink : దీన్ని తాగితే.. 10 రోజుల్లోనే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు క‌రుగుతుంది..

Belly Fat Drink : స‌న్న‌గా, నాజుకుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. కానీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అధిక బ‌రువుతో ఇబ్బంది ప‌డే వారు మ‌న‌లో చాలా మందే ఉన్నారు. పొట్ట చుట్టూ ఉండే కొవ్వును క‌రిగించ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల‌మైన వారు కూడా ఉన్నారు. ఈ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించ‌డానికి ఆహార నియ‌మాల‌ను పాటించ‌డంతోపాటు డిటాక్సిఫికేష‌న్ డ్రింక్ ల‌ను, హెల్తీ డ్రింక్ ల‌ను కూడా త‌యారు చేసుకుని తాగాల్సి ఉంటుంది. ఇవి కూడా మ‌న బ‌రువు త‌గ్గ‌డానికి బాగా ప‌ని చేస్తాయి. ఇలాడ్రింక్ ల‌ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన మ‌లినాలు తొల‌గిపోవ‌డంతోపాటు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తొల‌గించి మ‌న శ‌రీర బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి.

బ‌రువును త‌గ్గించే ఈ డ్రింక్ ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ‌రువును నియంత్రించే ఈ డ్రింక్ ను త‌యారు చేసుకోవ‌డానికి గాను మ‌నం నాలుగు నిమ్మ‌కాయ‌ల‌ను, ఒక లీట‌ర్ నీటిని, ఒక టీ స్పూన్ న‌ల్ల ఉప్పును ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా మ‌నం ఉప‌యోగించే నిమ్మ‌కాయ‌ల‌ను శుభ్రంగా క‌డుక్కోవాలి. త‌రువాత వీటిని ముక్క‌లుగా కోసి ర‌సాన్ని అంతా తీసేసి నిమ్మ చెక్క‌ల‌ను ప‌క్క‌కు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్ల‌ను పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక నిమ్మ చెక్క‌ల‌ను వేసి ఈ నీటిని 8 నుండి 10 నిమిషాల పాటు బాగా వేడి చేయాలి. త‌రువాత ఈ నీటిలో న‌ల్ల ఉప్పును వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న నీటిని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. ఇలా విధంగా త‌యారు చేసుకున్న ఈ డ్రింక్ ను మూడు నుండి నాలుగు గ్లాసుల ప‌రిమాణంలో ప్ర‌తి రోజూ మూడు పూట‌లా ఆహారం తీసుకున్న అర‌గంట త‌రువాత తీసుకోవాలి.

Belly Fat Drink take this daily for 10 days
Belly Fat Drink

ఈ విధంగా క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌డం వ‌ల్ల 10 నుండి 15 రోజుల్లోనే మ‌న శ‌రీరంలో వ‌చ్చిన మార్పును మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల పొట్ట‌తోపాటు ఇత‌ర శ‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రిగి త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. అంతేకాకుండా ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. చ‌ర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా కూడా మెరుగుప‌డుతుంది. పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య కూడా నివారించ‌బ‌డుతుంది. ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల గాయాలు, పుండ్లు వంటివి కూడా త్వ‌ర‌గా మానుతాయి. ఈ విధంగా స‌హ‌జసిద్ధ‌ ప‌దార్థాల‌తో త‌యారు చేసుకున్న ఈ డిటాక్సిఫికేష‌న్ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గ‌డంతోపాటు ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి.

D

Recent Posts