Drumstick Leaves Juice : మన శరీరంలో ఉండే ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒకటి. శారీరక ఎదుగుదలలో ఈ గ్రంథి ప్రాధాన పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మన శరీరంలో చాలా సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రధౄనంగా అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ సమస్య తలెత్తుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకండా వంశపారపర్యంగా కూడా థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంది. బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, చర్మం పొడిగా మారడం, తల తిరగడం, మలబద్దకం, రక్తపోటు పెరగడం, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలుపెరగడం, ఆందోళన, స్త్రీలల్లో నెలసరి సక్రమంగా లేకపోవడం, క్యాల్షియం, విటమిన్ డి లోపం రావడం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు థైరాయిడ్ బారిన పడిన వారిలో కనిపిస్తాయి.
ఈ సమస్య బారిన పడిన వారు జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది. సహజ పద్దతుల్లో కూడా మనం ఈ సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు మునగాకుల జ్యూస్ ను తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య పూర్తిగా తొలగిపోతుందని ఆయుర్వేదం చెబుతుంది. మునగాకులో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయి. ఎంతోకాలంగా ఔషధాల తయారీలో ఈ మునగాకులను ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో 300 లకు పైగా వ్యాధులను నయం చేయడంలో మునగాకును ఉపయోగిస్తారట.

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు మునగాకులతో జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్యూస్ ను తయారు చేయడానికి గానూ ముందుగా లేత మునగాకులను తీసుకుని జార్ లో వేయాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా జ్యూస్ లా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి వడకట్టి తీసుకోవాలి. ఈ మునగాకుల జ్యూస్ ను రోజూ ఉదయ పరగడుపున అలాగే సాయంత్రం భోజనానికి ముందు 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవాలి.
ఇలా మునగాకుల జ్యూస్ తయారు చేసుకుని తాగడం వల్ల థైరాయిడ్ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఈ మునగాకు జ్యూస్ ను తాగడం వల్ల థైరాయిడ్ సమస్య పరిష్కారం అవ్వడంతో పాటు మనం ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ తగిన మోతాదులో మునగాకు జ్యూస్ ను తాగడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.