ప్రపంచ వ్యాప్తంగా నీటి తరువాత అత్యధిక శాతం మంది సేవిస్తున్న పానీయాల్లో టీ రెండో స్థానంలో ఉంటుంది. రోజూ ఉదయాన్నే వేడిగా ఒక కప్పు తాగితే శరీరానికి శక్తి వస్తుంది. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. అయితే సాధారణ టీ కి బదులుగా అదే సమయంలో నారింజ పండు తొక్కలతో టీ తయారు చేసుకుని తాగితే దాంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నారింజ పండ్లను తిన్నాక చాలా మంది తొక్కలను పడేస్తారు. కానీ వాటితో టీ తయారు చేసుకుని తాగితే మన శరీరానికి విటమిన్ సి లభిస్తుంది. దీంతోపాటు పోషకాలు అందుతాయి. నారింజ పండు తొక్కల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవన్నీ మనకు అందుతాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* నారింజ పండు తొక్క – ఒక పండుకు చెందిన సగం తొక్క
* నీళ్లు – ఒకటిన్నర కప్పు
* దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క
* లవంగాలు – 2 లేదా 3
* యాలకులు – 1 లేదా 2
* బెల్లం – అర టేబుల్ స్పూన్
ఒక పాత్రలో నీటిని తీసుకుని వాటిని మీడియం మంటపై మరిగించాలి. నారింజ పండు తొక్క, ఇతర పదార్థాలు వేయాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించాలి. స్టవ్ ఆర్పేయాలి. టీ ని వడకట్టి అందులో బెల్లం వేసి బాగా కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఈ టీ ని రోజూ తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
నారింజ పండు తొక్కలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. అలాగే ఫైబర్, విటమిన్ సి, పాలిఫినాల్స్, విటమిన్ ఎ, ఫోలేట్, రైబో ఫ్లేవిన్, థయామిన్, విటమిన్ బి6, కాల్షియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. అందువల్ల ఆ టీ ని తాగితే ఈ పోషకాలన్నీ మనకు లభిస్తాయి. ఈ టీని తాగడం వల్ల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. వాపులు తగ్గుతాయి. చర్మ క్యాన్సర్ రాకుండా ఉంటుంది.
జీర్ణ ప్రక్రియ మెరుగు పడుతుంది. మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. శరీర మెటబాలిజం, రోగ నిరోధక శక్తి పెరుగుతాయి. అధిక బరువు తగ్గుతారు. నారింజ పండు తొక్కల్లో ఉండే పాలిఫినాల్స్ వల్ల టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటుంది. షుగర్ ఉన్నవారిలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. స్థూలకాయం, అల్జీమర్స్ రాకుండా ఉంటాయి.