Health Tips : ప్రస్తుత తరుణంలో అనేక వ్యాధులు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాటిల్లో ప్రధానంగా చెప్పుకునేవి.. అధిక బరువు, జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు, షుగర్. ఇవి చాలా మందికి వస్తున్నాయి. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. అయితే కింద చెప్పిన విధంగా ఓ ఔషధాన్ని మీ ఇంట్లో లభించే పదార్థాలతోనే తయారు చేసుకుని రోజూ రాత్రి నిద్రించే ముందు తాగాలి. దీని వల్ల అనేక వ్యాధులను రాకుండా చూసుకోవచ్చు. మరి ఆ ఔషధం ఏమిటి.. దాన్ని ఎలా తయారు చేయాలి..? అంటే..
మెంతులను 250 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. అలాగే వాము 100 గ్రాములు, నల్ల జీలకర్ర 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఈ మూడు పదార్థాలను వేర్వేరుగా తీసుకుని పెనంపై వేయించాలి. అనంతరం ఈ మూడింటిని కలపాలి. ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి బాగా పట్టి పొడిలా చేసుకోవాలి. ఆ పొడిని గాలి చొరబడకుండా సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న పొడిని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. రాత్రి పూట భోజనం అనంతరం లేదా నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఆ నీటిలో కలిపి తాగేయాలి. ఇది తాగిన తరువాత వేటినీ తీసుకోరాదు. ఇలా 3 నెలల పాటు రోజూ క్రమం తప్పకుండా తాగాలి.
ఈ విధంగా పైన తెలిపిన పొడిని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా అధిక బరువు తగ్గుతారు. రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ఎముకలు, కండరాలు, కీళ్లు దృఢంగా మారుతాయి. కొవ్వు కరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
అయితే ఈ సమస్యలు తగ్గకపోతే 15 రోజుల పాటు విరామం ఇచ్చిన అనంతరం మళ్లీ ఈ పొడిని పైన చెప్పిన విధంగా తాగాల్సి ఉంటుంది. ఇలా తగ్గే వరకు చేయవచ్చు.